రౌడీబాయ్.. మోస్ట్ డిజైరబుల్ మెన్
సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదగాలంటే.. ఎవరో ఒకరి అండదండలు ఉండాలి. ఎంత కష్టపడ్డా కానీ .. అదృష్టం రావాలి, టైమ్ కూడా కలిసి రావాలి. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈ రెండు త్వరగానే కలిసి వచ్చాయి. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డం సంపాదించుకుని .. టాలీవుడ్లో అతడు ఫేం తెచ్చుకున్నాడు. విజయ్ తన ఫ్యాషన్, యాటిట్యూడ్, నటనతో తక్కువ సమయంలో ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. అతడి ఫాలోయింగే 2019 ఏడాదికిగాను హైదరాబాద్ […]
సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదగాలంటే.. ఎవరో ఒకరి అండదండలు ఉండాలి. ఎంత కష్టపడ్డా కానీ .. అదృష్టం రావాలి, టైమ్ కూడా కలిసి రావాలి. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈ రెండు త్వరగానే కలిసి వచ్చాయి. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డం సంపాదించుకుని .. టాలీవుడ్లో అతడు ఫేం తెచ్చుకున్నాడు. విజయ్ తన ఫ్యాషన్, యాటిట్యూడ్, నటనతో తక్కువ సమయంలో ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. అతడి ఫాలోయింగే 2019 ఏడాదికిగాను హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా నిలిచేలా చేసింది.
ప్రముఖ మ్యాగజైన్ “హైదరాబాద్ టైమ్స్’’ ప్రతి ఏడాదిలానే 2019 సంవత్సరానికిగానూ ‘‘మోస్ట్ డిజైరబుల్ మెన్’’ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఆన్లైన్ ఓటింగ్ ఆధారంగా మోస్ట్ డిజైరబుల్ మెన్స్‌ను ఎంపిక చేస్తారు. ‘‘30 మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019” లిస్ట్ లో విజయ్ దేవరకొండ నెంబర్ వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. 2017 సంవత్సరంలో నెంబర్ 2 ప్లేస్, 2018లో నెంబర్ 1 ప్లేస్, 2019లో కూడా మళ్లీ ప్రథమ స్థానాన్నే కైవసం చేసుకున్నాడు విజయ్. 2018 సంవత్సరంలో అర్జున్‌రెడ్డి.. గీత గోవిందం చిత్రాలతో హిట్లు కొట్టిన రౌడీస్టార్, ఆ తర్వాత విడుదలైన సినిమాలన్నీ కూడా మిశ్రమ స్పందనలు దక్కించుకోవడంతో విజయ్ క్రేజ్ తగ్గుతోందని.. స్టార్‌డం పడిపోతుందని కొందరన్నారు. కానీ, విజయ్ వాటన్నింటికీ తన క్రేజీ స్టార్‌డమ్‌తో సమాధానం ఇచ్చాడు. 2018 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్లో మూడో స్థానంలో ఉన్న రామ్‌చరణ్ ఈ ఏడాది రెండోస్థానంలో నిలిచాడు. 2018లో 11 స్థానంలో ఉన్న రామ్, 2019లో మూడో స్థానం దక్కించుకున్నాడు. ప్రభాస్ ఆ తర్వాతి స్థానంలో ఉండగా, సుధీర్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్, యాంకర్ ప్రదీప్ లు టాప్ 20లో నిలవడం చెప్పుకోదగ్గ విషయం.
tags : vijay devarakonda, rowdy star, ram pothineni, prabhas, allu arjun, ntr, most desirable man, 2019