‘ఫైటర్’ స్టైలే వేరు : విజయ్

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టైలే వేరు. తను ఏం చేసినా తప్పకుండా అందులో ఏదో స్పెషాలిటీ ఉంటుంది. సినిమా నుంచి ఫ్యాషన్ వరకు అన్నింటా కొత్తదనం కోరుకునే విజయ్.. తన శ్రమంతా రిజల్ట్‌లో కనబడేలా చేస్తాడు. ‘ఫైటర్’ కూడా అలాంటి సినిమానే అని చెప్తున్నాడు విజయ్. ఇప్పటి వరకు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసిన విజయ్.. ఫస్ట్ టైమ్ కమర్షియల్ సినిమా చేస్తుండగా, ఫైటర్‌లా కనిపించేందుకు ఎనిమిది నెలలుగా వర్క్‌ఔట్ చేస్తున్నట్లు తెలిపాడు. […]

Update: 2020-10-10 05:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టైలే వేరు. తను ఏం చేసినా తప్పకుండా అందులో ఏదో స్పెషాలిటీ ఉంటుంది. సినిమా నుంచి ఫ్యాషన్ వరకు అన్నింటా కొత్తదనం కోరుకునే విజయ్.. తన శ్రమంతా రిజల్ట్‌లో కనబడేలా చేస్తాడు. ‘ఫైటర్’ కూడా అలాంటి సినిమానే అని చెప్తున్నాడు విజయ్. ఇప్పటి వరకు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసిన విజయ్.. ఫస్ట్ టైమ్ కమర్షియల్ సినిమా చేస్తుండగా, ఫైటర్‌లా కనిపించేందుకు ఎనిమిది నెలలుగా వర్క్‌ఔట్ చేస్తున్నట్లు తెలిపాడు.

ఇప్పటి వరకు ఎన్నో కమర్షియల్ సినిమాలు వచ్చినా.. ‘ఫైటర్’ మాత్రం అలాంటి రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదన్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కథ చెప్పినప్పుడు.. చేస్తే ఇలాంటి కమర్షియల్ జోనర్ ఫిల్మ్స్ చేయాలని ఫిక్స్ అయినట్లు చెప్పాడు. ‘ఇది నా స్టైల్ కమర్షియల్ సినిమా’ అని తెలిపాడు. పోకిరి లాంటి కమర్షియల్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి.. తన ఫేవరెట్ డైరెక్టర్ అని తెలిపారు విజయ్.

కాగా, అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను కరణ్ జోహార్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News