తాండూరు ఆసుపత్రి సుపరింటెండెంట్‌పై విచారణ
దిశ, రంగారెడ్డి: తాండూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లిఖార్జున్‌పై గురువారం వైద్య విధాన పరిషత్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఆసుప్రతిలో సూపరింటెండెంట్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ అనుమతులు లేకుండానే హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ నిధులను అక్రమంగా అభివృద్ధి పనుల పేరిట వినియోగించుకుంచున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే తాను నిబంధనల మేరకే రూ.30 లక్షల నిధులతో ఆస్పత్రిలో పలురకాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు సూపరింటెండెంట్ విజిలెన్స్ అధికారుల […]
దిశ, రంగారెడ్డి: తాండూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లిఖార్జున్‌పై గురువారం వైద్య విధాన పరిషత్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఆసుప్రతిలో సూపరింటెండెంట్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ అనుమతులు లేకుండానే హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ నిధులను అక్రమంగా అభివృద్ధి పనుల పేరిట వినియోగించుకుంచున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే తాను నిబంధనల మేరకే రూ.30 లక్షల నిధులతో ఆస్పత్రిలో పలురకాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు సూపరింటెండెంట్ విజిలెన్స్ అధికారుల ముందు వెల్లడించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏడుగురు కాంటాక్ట్ వైద్య సిబ్బందిని కూడా అక్రమంగా తొలగించారన్న ఆరోపణలపై కూడా విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. ఆసుపత్రి వైద్య సిబ్బందితో సూపరింటెండెంట్ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు లిఖితపూర్వకంగా వివరాలు సేకరించారు. అనంతరం నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.