విజిలెన్స్ దాడులు.. రూ.3కోట్ల విలువైన విత్తనాలు సీజ్

దిశ, కుత్బుల్లాపూర్: నిబంధనలు పాటించని విత్తనాల గోదాంపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి భారీ ఎత్తున విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ డీఎస్పీ పాపారావు వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం కండ్లకోయలోని ఎకో ఆగ్రో సీడ్స్ గోదాంలో అవకతవకలు జరుగుతున్నాయనే విశ్వసనీయ వర్గాల సమాచారంతో విజిలెన్స్ అధికారులు మంగళవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకూ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రూ.12.24లక్షల విలువైన 1529 జొన్నప్యాకెట్లు, రూ.18.76లక్షల విలువైన 1210 పొద్దు తిరుగుడు ప్యాకెట్లపై […]

Update: 2020-06-03 06:31 GMT

దిశ, కుత్బుల్లాపూర్: నిబంధనలు పాటించని విత్తనాల గోదాంపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి భారీ ఎత్తున విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ డీఎస్పీ పాపారావు వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం కండ్లకోయలోని ఎకో ఆగ్రో సీడ్స్ గోదాంలో అవకతవకలు జరుగుతున్నాయనే విశ్వసనీయ వర్గాల సమాచారంతో విజిలెన్స్ అధికారులు మంగళవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకూ దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రూ.12.24లక్షల విలువైన 1529 జొన్నప్యాకెట్లు, రూ.18.76లక్షల విలువైన 1210 పొద్దు తిరుగుడు ప్యాకెట్లపై టెస్టింగ్ చేసిన తేదీ, ప్యాకింగ్ చేసిన తేదీల్లో వ్యత్యాసమున్నట్టు గుర్తించారు. గోదాంలో ఉన్న విత్తనాల స్టాక్, రికార్డుల్లో రూ.2.71కోట్ల వ్యత్యాసమున్నట్టు నిర్ధారించారు. ఈ మేరకు వ్యవసాయాధికారులతో విత్తనాలను సీజ్ చేయించారు. నిర్వాహకుడితో పాటు పని చేసే వారిపై 6ఏ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News