రూ.18వేలుంటే బంగారంలో మునిగి తేలొచ్చు

దిశ,వెబ్‌డెస్క్:గుమ్మ‌డికాయంత బుర్ర‌లో ఆవ‌గింజంత తెలివి ఉంటేచాలు ప్ర‌పంచాన్ని దున్నేయోచ్చ‌న్న సామెత‌ను నిజం చేస్తుంది ఈ హోటల్ యాజమాన్యం. చైనాలోని వియత్నాం రాజధాని హనోయిలోని డోల్స్ హనోయి గోల్డెన్ లేక్ అనే ఫైవ్ స్టార్ హోటల్ ఉంది. అది చూడటానికే హోటల్. కానీ అక్కడ ఎటు చూసినా బంగారమే దర్శనమిస్తుంది. కష్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు సంస్థ యాజమాన్యం బంగారంతో 25 అంతస్తుల హోటల్ ను నిర్మించింది. 342 రూమ్ లు, 10డ్యూప్లెక్స్ సూట్స్, 1 ప్రెసిడెంటల్ డ్యూప్లెక్స్ సూట్స్ […]

Update: 2020-12-24 01:11 GMT

దిశ,వెబ్‌డెస్క్:గుమ్మ‌డికాయంత బుర్ర‌లో ఆవ‌గింజంత తెలివి ఉంటేచాలు ప్ర‌పంచాన్ని దున్నేయోచ్చ‌న్న సామెత‌ను నిజం చేస్తుంది ఈ హోటల్ యాజమాన్యం.

చైనాలోని వియత్నాం రాజధాని హనోయిలోని డోల్స్ హనోయి గోల్డెన్ లేక్ అనే ఫైవ్ స్టార్ హోటల్ ఉంది. అది చూడటానికే హోటల్. కానీ అక్కడ ఎటు చూసినా బంగారమే దర్శనమిస్తుంది. కష్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు సంస్థ యాజమాన్యం బంగారంతో 25 అంతస్తుల హోటల్ ను నిర్మించింది.

342 రూమ్ లు, 10డ్యూప్లెక్స్ సూట్స్, 1 ప్రెసిడెంటల్ డ్యూప్లెక్స్ సూట్స్ ఉన్నాయి. ఒక్కో రూమ్‌ను 24 క్యారెట్ల బంగారం పూత పూయడంతో స్వర్ణకాంతుల్ని విరజిమ్ముతూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టిపడేలా చేస్తుంది. గ్లాసులు, డోర్లు, బాత్ టబ్, వాష్ బేసిన్లు బంగారం తో డిజైన్ చేయడంతో ఆ హోటల్ కు కష్టమర్ల తాకిడి ఎక్కువైంది.

ప్రపంచంలో తొలిసారిగా బంగారంతో హోటల్ ను నిర్మించామని ప్రచారం చేసుకుంటుంది. ఈ ప్రచారంతో మీరు బంగారంతో హోటల్‌ను నిర్మించారు. సామాన్యులు మీహోటల్‌కు ఎలా వస్తారని ప్రశ్నిస్తే. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.18వేలు ఉంటే ఒక్క నైట్ హోటల్‌లో బంగారంలో మునిగి తేలొచ్చని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

Tags:    

Similar News