ఇలా.. ఇంట్లోనే మాస్క్ తయారు చేసుకోండి : విద్యా బాలన్

కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలి అంటే మాస్క్ ధరించాల్సిందే. బయట అడుగుపెట్టాల్సి వస్తే ఇది తప్పనిసరి కూడా. కానీ N 95 మాస్క్ ల కొరత దేశంలో కొంచెం ఎక్కువగానే ఉంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు … N95 మాస్క్ లను వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది కోసం ఉంచాలని…ప్రజలు ఇంట్లోనే మాస్క్ లు తయారు చేసుకోవాలని పిలుపునిస్తున్నాయి. ఈ క్రమంలోనే మాస్క్ ఇండియా, అప్నా దేశ్ అప్న మాస్క్, హోమ్ మేడ్ మాస్క్ […]

Update: 2020-04-19 06:06 GMT

కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలి అంటే మాస్క్ ధరించాల్సిందే. బయట అడుగుపెట్టాల్సి వస్తే ఇది తప్పనిసరి కూడా. కానీ N 95 మాస్క్ ల కొరత దేశంలో కొంచెం ఎక్కువగానే ఉంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు … N95 మాస్క్ లను వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది కోసం ఉంచాలని…ప్రజలు ఇంట్లోనే మాస్క్ లు తయారు చేసుకోవాలని పిలుపునిస్తున్నాయి. ఈ క్రమంలోనే మాస్క్ ఇండియా, అప్నా దేశ్ అప్న మాస్క్, హోమ్ మేడ్ మాస్క్ చాలెంజ్ లతో అవగాహన పెంచుతున్నారు సినీ ప్రముఖులు. హ్యాండ్ ఖర్చిఫ్, చున్నీ, అమ్మ కొంగును మాస్క్ లుగా వినియోగించుకోవచ్చు అని పిలుపునిస్తున్నారు. మరికొంత మంది ఇంట్లో ఎలా మాస్క్ లు తయారు చేసుకోవచ్చు అనేది వీడియోల ద్వారా చేసి చూపిస్తున్నారు. లోనే బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్… జాకెట్ పీస్ తో మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పింది. రెండు రబ్బరు బ్యాండ్లు, చిన్న క్లాత్ తో చక్కగా మాస్క్ తయారు చేసి చూపింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో మాస్క్ వినియోగం తప్పనిసరి అని…. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే మాస్క్ తయారు చేసుకోవాలని కోరారు. తద్వారా మన రియల్ హీరోస్ అయిన హెల్త్ వర్కర్లకు సపోర్ట్ చేద్దామని పిలుపునిచ్చారు.

Tags : Vidya Balan, Bollywood, Maskindia, Apnades Apna mask, CoronaVirus Covid 19

Tags:    

Similar News