వాట్సాప్ వెబ్‌లో వీడియో కాల్స్?

దిశ, వెబ్‌డెస్క్ : ఇప్పటి వరకు వాట్సాప్ వెబ్‌లో మెసేజ్‌లు, ఫైల్‌లు పంపించుకునే సదుపాయం ఉంది కానీ వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ చేసుకోవాలంటే మాత్రం మళ్లీ ఫోన్ నుంచి చేయాల్సిన పరిస్థితి. అందుకే ఇక నుంచి వాట్సాప్‌ వెబ్‌లోనే వీడియా, ఆడియో కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కూడా వాట్సాప్ తీసుకురాబోతుంది. ఇటీవల విడుదలైన 2.2043.7 అప్‌డేట్‌లో ఇప్పటికే ఈ ఫీచర్‌ను బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వాట్సాప్ అప్‌డేట్‌ల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే […]

Update: 2020-10-21 04:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇప్పటి వరకు వాట్సాప్ వెబ్‌లో మెసేజ్‌లు, ఫైల్‌లు పంపించుకునే సదుపాయం ఉంది కానీ వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ చేసుకోవాలంటే మాత్రం మళ్లీ ఫోన్ నుంచి చేయాల్సిన పరిస్థితి. అందుకే ఇక నుంచి వాట్సాప్‌ వెబ్‌లోనే వీడియా, ఆడియో కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కూడా వాట్సాప్ తీసుకురాబోతుంది. ఇటీవల విడుదలైన 2.2043.7 అప్‌డేట్‌లో ఇప్పటికే ఈ ఫీచర్‌ను బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వాట్సాప్ అప్‌డేట్‌ల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే వ్యాబీటాఇన్ఫో వెబ్‌సైట్ దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను కూడా విడుదల చేసింది.

ఈ స్క్రీన్‌షాట్‌లో ఏదైనా కాల్ వచ్చినపుడు వాట్సాప్‌ వెబ్‌లో ఒక పాప్ అప్ కనిపించడం చూడవచ్చు. అందులో కాల్ ఎత్తడానికి, కట్ చేయడానికి ఆప్షన్‌లు కూడా కనిపిస్తున్నాయి. దీనితో పాటు వాట్సాప్‌ వెబ్‌లో గ్రూప్ ఆడియో, వీడియో కాల్స్‌కు కూడా సదుపాయం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫీచర్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఇక కాల్ వచ్చిన ప్రతిసారి ఫోన్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ద్వారానే మాట్లాడుకునే అవకాశం కలగనుంది.

Tags:    

Similar News