ట్రైలర్ టాక్ : వెంకీ విశ్వరూపం.. 'నారప్ప' నిదర్శనం
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రీమేక్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేస్తూ విజయాన్ని అందుకుంటున్నారు. ఇక టాలీవుడ్ లో రీమేక్ లకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారిపోయాడు సీనియర్ హీరో వెంకటేష్.. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘అసురన్’ చిత్రాన్ని తెలుగులో ‘నారప్ప’ పేరుతో వెంకీ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. థియేటర్ లో విడుదల కావాల్సిన ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రీమేక్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేస్తూ విజయాన్ని అందుకుంటున్నారు. ఇక టాలీవుడ్ లో రీమేక్ లకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారిపోయాడు సీనియర్ హీరో వెంకటేష్.. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘అసురన్’ చిత్రాన్ని తెలుగులో ‘నారప్ప’ పేరుతో వెంకీ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. థియేటర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా జూలై 20 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘నారప్ప’ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఊర మాస్ గెటప్ లో వెంకటేష్ విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. తమిళ్ ‘అసురన్’ కి ఈ మాత్రం తగ్గకుండా ధనుష్ పాత్రలో వెంకీ నటించాడు అనడం కన్నా జీవించాడనే చెప్పాలి. ట్రైలర్ విషయానికొస్తే.. కొడుకుల భవిష్యత్తు కోసం అగ్రకులాల వారితో ఓ తండ్రి చేసే పోరాటాన్ని ఉత్కంఠభరితంగా చూపించారు. ఇక ఓల్డ్ మ్యాన్ గెటప్ లో ఉన్న వెంకటేష్ చేతిలో ఒక కత్తి పట్టుకొని కోపంతో శత్రువులను వేటాడానికి వెళ్లే సీన్స్ అయితే గూస్ బంప్స్ ఖాయం.
ఒరిజినల్ వెర్షన్ కి ఎక్కడా తగ్గకుండా శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ కానీ, చూపించిన విజువల్స్ కానీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక వెంకటేష్, ప్రియమణిల నటన ఒక ఎత్తయితే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తని చెప్పాలి. ఒరిజనల్ వెర్షన్ మ్యాజిక్ ని రిపీట్ చేసినా.. ‘రా నరకరా.. ఎదురు తిరిగి కసిగా నరకరా..’ అని వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఇప్పటివరకు నారప్ప ఎలా ఉండబోతుందో అని అనుకున్న వాళ్లకు ఈ ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు మొదలైపోయాయి. మరి ఈ సినిమాతో వెంకీ మామ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.