లోన్‌యాప్ మిగిల్చిన విషాదం.. ఆ కుటుంబానికి పెద్ద దిక్కైన ఎమ్మెల్సీ కవిత
దిశ, వెబ్‌డెస్క్ : లోన్‌యాప్ నిర్వహకుల వేధింపులకు మరొకరు బలయ్యారు. ఇటీవల ఆన్లైన్ యాప్స్ ద్వారా రుణం పొందిన చంద్రమోహన్ అనే వ్యక్తి తిరిగి డబ్బులు తీర్చలేకపోయాడు. యాప్ నిర్వహకుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. చంద్రమోహన్‌కు భార్య ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి దు:ఖ సాగరంలో మునిగిపోయిన బాధిత కుటుంబానికి సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత అండగా […]
దిశ, వెబ్‌డెస్క్ : లోన్‌యాప్ నిర్వహకుల వేధింపులకు మరొకరు బలయ్యారు. ఇటీవల ఆన్లైన్ యాప్స్ ద్వారా రుణం పొందిన చంద్రమోహన్ అనే వ్యక్తి తిరిగి డబ్బులు తీర్చలేకపోయాడు. యాప్ నిర్వహకుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. చంద్రమోహన్‌కు భార్య ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి దు:ఖ సాగరంలో మునిగిపోయిన బాధిత కుటుంబానికి సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత అండగా నిలిచారు. చంద్రమోహన్ భార్యకు ఉద్యోగంతో పాటు ముగ్గురు ఆడపిల్లల చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని ముందుకొచ్చారు.