కోటి మందికి పైగా కస్టమర్లను పోగొట్టుకున్న వొడాఫోన్ ఐడియా!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా మొత్తం 1.24 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. దిగ్గజ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఈ త్రైమాసికంలో 1.44 కోట్ల సబ్‌స్క్రైబర్లను సాధించింది. కొవిడ్-19 మహమ్మారి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కంపెనీ వినియోగదారులను పోగొట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య మూడు, నాలుగు త్రైమాసికాల్లో కొంతమేర సబ్‌స్క్రైబర్ల నష్టాన్ని తగ్గించగలిగింది. అయితే, సమీక్షించిన […]

Update: 2021-08-15 08:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా మొత్తం 1.24 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. దిగ్గజ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఈ త్రైమాసికంలో 1.44 కోట్ల సబ్‌స్క్రైబర్లను సాధించింది. కొవిడ్-19 మహమ్మారి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కంపెనీ వినియోగదారులను పోగొట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య మూడు, నాలుగు త్రైమాసికాల్లో కొంతమేర సబ్‌స్క్రైబర్ల నష్టాన్ని తగ్గించగలిగింది. అయితే, సమీక్షించిన త్రైమాసికంలో 1.2 కోట్ల మందిని కోల్పోవడంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 25.54 కోట్లకు తగ్గింది.

4జీ సబ్‌స్క్రైబర్ల నష్టం తక్కువగానే ఉన్నప్పటికీ ఎక్కువగా 2జీ వినియోగదారులనే వొడాఫోన్ ఐడియా కోల్పోయింది. జూన్ త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా 4జీ వినియోగదారులు 11.29 కోట్లకు క్షీణించారు. వొడాఫోన్ ఐడియా 1.24 కోట్ల మందిని కోల్పోవడం ద్వారా 2019 నాలుగో త్రైమాసికంలో పోగొట్టుకున్న 1.29 కోట్ల వినియోగదారుల తర్వాత ఇదే అత్యధిక నష్టం కావడం గమనార్హం. మొత్తంగా గడిచిన రెండేళ్ల కాలంలో వొడాఫోన్ ఐడియా మొత్తం 6.46 కోట్ల మంది కస్టమర్లు వొడాఫోన్ నుంచి నిష్క్రమించారు. ఈ కాలంలో జియో 10.93 కోట్లు, ఎయిర్‌టెల్ 4.4 కోట్ల మంది వినియోగదారులను సంపాదించాయి.

Tags:    

Similar News