ఆ దేవాలయాల్లో దర్శనాలు నిలిపివేయండి

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేయాలని విశ్వ హిందూ పరిషత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం కోఠిలోని వీహెచ్‌పీ కార్యాలయంలో అధ్యక్షుడు రామరాజు, కార్యదర్శి బండారి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో 150 మంది ఉద్యోగులకు కరోనా సోకిందన్నారు. శ్రీశైలంలో కూడా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ఉద్యోగులతో పాటు భక్తులు ఆందోళనలో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో యాదాద్రి, ధర్మపురి, వేములవాడ, భద్రాద్రి వంటి ప్రముఖ ఆలయాల్లో నిత్య […]

Update: 2020-07-21 07:54 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేయాలని విశ్వ హిందూ పరిషత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం కోఠిలోని వీహెచ్‌పీ కార్యాలయంలో అధ్యక్షుడు రామరాజు, కార్యదర్శి బండారి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో 150 మంది ఉద్యోగులకు కరోనా సోకిందన్నారు. శ్రీశైలంలో కూడా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ఉద్యోగులతో పాటు భక్తులు ఆందోళనలో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో యాదాద్రి, ధర్మపురి, వేములవాడ, భద్రాద్రి వంటి ప్రముఖ ఆలయాల్లో నిత్య నైవేద్యాలను కొనసాగిస్తూ భక్తుల దర్శనాలు నిలిపివేయాలని కోరారు.

Tags:    

Similar News