Nursing Officers Exam: ప్రశాంతంగా ముగిసిన నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్.. మొత్తం 40,423 మంది హాజరు..!
రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్స్ ఎగ్జామ్(Nursing Officers Exam) ప్రశాంతంగా ముగిసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ ఆఫీసర్స్ ఎగ్జామ్(Nursing Officers Exam) ప్రశాంతంగా ముగిసింది. ఈ రిక్రూట్ మెంట్ కొరకు 42,244 మంది దరఖాస్తు చేసుకోగా, కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించిన ఈ టెస్టుకు రాష్ట్ర వ్యాప్తంగా 40,423 మంది హాజరయ్యారు. అంటే దాదాపు 95.69 శాతం మంది అటెండ్(Attend) అయినట్లు మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. దీంతో 2322 పోస్టుల భర్తీ కొరకు జరిగిన ఈ ఎగ్జామ్ కు పుల్ కాంపిటేషన్ ఏర్పడింది. అయితే గతంలో పోల్చితే ఈ సారి ప్రశ్నాపత్రం టఫ్‌గా వచ్చిందని అభ్యర్ధులు చెప్తున్నారు. సెషన్-1తో పోల్చితే సెషన్-2 వెరీ హార్డ్ ఉందంటూ మెజార్టీ అభ్యర్ధులు వివరిస్తున్నారు. సిలబస్(Syllabus)లోని ప్రశ్నలు కంటే , హాస్పిటల్స్(Hospitals) అనుబంధ క్వశ్చనరీ ఎక్కువగా వచ్చినట్లు అభ్యర్ధులు పేర్కొన్నారు.
ఇక గురుకులాల్లో ఇప్పటికే నర్సింగ్ ఆఫీసర్లుగా వర్క్ చేస్తున్నోళ్లు కూడా మళ్లీ ఎగ్జామ్ రాశారు. అంటే మంచి ప్రాంతాల్లో పోస్టింగ్ వస్తుందని ఇలా చేస్తారని అధికారులు చెప్తున్నారు. అయితే ఎగ్జామ్ రాసే అభ్యర్ధులు ఆయా విభాగాల హెచ్వోడీ(HOD)ల నుంచి ఎన్ వోసీ(NOC) తీసుకొని పరీక్ష కంటే ముందు బోర్డుకు సబ్మిట్ చేయాలి. కానీ చాలా మంది ఈ రూల్(Rule)ను పాటించలేదని మెడికల్ బోర్డు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిబంధనల ప్రకారం వీళ్ల అభ్యర్థిత్వం రద్దు అయ్యే ఛాన్స్ ఉంది. ఇక గతంలో 317 జీవో ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లిన నర్సింగ్ ఆఫీసర్లు మళ్లీ కొత్తగా పరీక్ష రాశారు. వీళ్లు కూడా ఎన్ వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం వచ్చినోళ్లే మళ్లీ మళ్లీ పరీక్ష రాస్తూ అత్యధిక కాంపిటేషన్ ను తీసుకువస్తున్నారని న్యూ నర్సింగ్ క్యాండియేట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.