ఆయన కోసం చావడానికైనా సిద్ధం.. వీహెచ్ ఆమరణ నిరాహార దీక్ష

దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్​ అంబేడ్కర్ కోసం చావడానికైనా తాను సిద్ధమంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాగుట్టలో కూల్చిన అంబేడ్కర్ విగ్రహాన్ని తిరిగి వెనక్కి ఇవ్వాలంటూ అంబర్​పేటలోని తన ఇంట్లో వీహెచ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని తక్షణమే తమకు ఇవ్వాలంటూ డిమాండ్​ చేశారు. విగ్రహాం ఇచ్చేంతవరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందన్నారు. […]

Update: 2021-04-12 01:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్​ అంబేడ్కర్ కోసం చావడానికైనా తాను సిద్ధమంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాగుట్టలో కూల్చిన అంబేడ్కర్ విగ్రహాన్ని తిరిగి వెనక్కి ఇవ్వాలంటూ అంబర్​పేటలోని తన ఇంట్లో వీహెచ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని తక్షణమే తమకు ఇవ్వాలంటూ డిమాండ్​ చేశారు. విగ్రహాం ఇచ్చేంతవరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందన్నారు.

2019 ఏప్రిల్ 12న పంజాగుట్టలో తాను అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించానని, ఏప్రిల్ 13న విగ్రహాన్ని కూల్చేయడం దారుణమన్నారు. స్థాపించిన ప్రాంతం నుంచి అంబేడ్కర్ విగ్రహాన్ని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని, అప్పటి నుంచి పోలీస్​ స్టేషన్‌లోనే విగ్రహాన్ని బందీ చేశారన్నారు. రాజ్యంగాన్ని రాసిన అంబేడ్కర్ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్‌లో పెడతారా? అంటూ విమర్శించారు.

ఇంత జరిగినా ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరూ మాట్లాడటం లేదన్నారు. అంబేడ్కర్​ తెచ్చిన రాజ్యాంగంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారని, కానీ ఒక్కరు మాట్లాడకపోవడం బాధగా ఉందన్నారు.

Tags:    

Similar News