చిత్తశుద్ధి ఉంటే చిట్టా బయటపెట్టాలి

దిశ, న్యూస్‌బ్యూరో: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మార్వో నాగరాజు వద్ద ఓ ఎంపీ లేఖ లభించినట్లు వార్తలు వస్తున్నాయని, ఆ లేఖ ఏ ఎంపీదో బయటపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆదివారం గాంధీభవన్‌లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. నాగరాజు వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే భూ బకాసురుల చిట్టా బయటపెట్టాలన్నారు. ఈనెల 19న కీసర వెళ్లి వివరాలను బయటపెడతానని వీహెచ్ అన్నారు. […]

Update: 2020-08-16 11:20 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎమ్మార్వో నాగరాజు వద్ద ఓ ఎంపీ లేఖ లభించినట్లు వార్తలు వస్తున్నాయని, ఆ లేఖ ఏ ఎంపీదో బయటపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆదివారం గాంధీభవన్‌లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. నాగరాజు వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే భూ బకాసురుల చిట్టా బయటపెట్టాలన్నారు.

ఈనెల 19న కీసర వెళ్లి వివరాలను బయటపెడతానని వీహెచ్ అన్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేసి ఊరుకుంటే సరిపోదని, రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. కీసర ఎమ్మార్వో ఘటన తరువాత కలెక్టర్ ఉద్యోగం కూడా అవసరం లేదని, ఐదేళ్లు ఎమ్మార్వోగా ఉంటే చాలని కలెక్టర్లు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గ్రేటర్, దుబ్బాక ఎన్నికల అంశంపై వీహెచ్ స్పందించారు. ఎన్నికల అంశంపై చర్చ పెట్టాలన్నారు. కోర్ కమిటీ పెట్టాలని పీసీసీకి పదే పదే చెప్తున్నానని వీహెచ్ పేర్కొన్నారు.

Tags:    

Similar News