ఇండస్ట్రీలో విషాదం: మ్యూజిక్ డైరెక్టర్ రామ్ లక్ష్మణ్ మృతి

దిశ, సినిమా: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మణ్(ఐకానిక్ రామ్‌లక్ష్మణ్) కన్నుమూశారు. సల్మాన్ ఖాన్ ‘మైనే ప్యార్ కియా’, మాధురీ దీక్షిత్ ‘హమ్ ఆప్‌కే హై కౌన్’ లాంటి చిత్రాలకు సంగీతం అందించిన ఆయన.. ఈ రోజు ఉదయం నాగ్‌పూర్‌లోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్‌తో మృతిచెందారు. ఆరు రోజుల క్రితం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 78ఏళ్ల సంగీత దర్శకుడు బలహీనంగా మారిపోయాడని, ఇంట్లోనే వైద్యం తీసుకున్నాడని.. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున మరణించాడని కొడుకు అమర్ తెలిపాడు. […]

Update: 2021-05-22 03:34 GMT

దిశ, సినిమా: లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మణ్(ఐకానిక్ రామ్‌లక్ష్మణ్) కన్నుమూశారు. సల్మాన్ ఖాన్ ‘మైనే ప్యార్ కియా’, మాధురీ దీక్షిత్ ‘హమ్ ఆప్‌కే హై కౌన్’ లాంటి చిత్రాలకు సంగీతం అందించిన ఆయన.. ఈ రోజు ఉదయం నాగ్‌పూర్‌లోని తన నివాసంలో కార్డియాక్ అరెస్ట్‌తో మృతిచెందారు. ఆరు రోజుల క్రితం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 78ఏళ్ల సంగీత దర్శకుడు బలహీనంగా మారిపోయాడని, ఇంట్లోనే వైద్యం తీసుకున్నాడని.. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున మరణించాడని కొడుకు అమర్ తెలిపాడు.

లక్ష్మణ్ సొంత పేరు విజయ్ పాటిల్ కాగా.. తన కొలాబొరేటర్ సురేంద్రతో కలిసి రామ్-లక్ష్మణ్ పేరుతో మ్యూజిక్ జర్నీ స్టార్ట్ చేశాడు. పాండు హవల్దార్(1975) అనే మరాఠీ సినిమాకు తొలిసారిగా పనిచేయగా.. సురేంద్ర 1976లోనే కన్నుమూశారు. అయినా సరే రామ్-లక్ష్మణ్ స్క్రీన్ నేమ్‌తో విజయ్ పాటిల్ తన జర్నీ కొనసాగించారు. నాలుగు దశాబ్ధాలకుపైగా సంగీత దర్శకుడిగా పనిచేసిన ఆయన హిందీ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో 150కిపైగా సినిమాలకు సంగీతం సమకూర్చారు.

Tags:    

Similar News