సీనియర్ నటి జయంతికి సీరియస్

దిశ, వెబ్ డెస్క్: తనదైన నటనతో దక్షిణాదిలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో చేరారు. ఆమె గత కొంతకాలంగా ఉబ్బసం వ్యాధితో బాధపడుతోంది. పరిస్థితి విషమించడంతో బుధవారం కుటుంబ సభ్యులు బెంగుళూరు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం శ్వాస తీసుకోవడానికి ఆమె ఇబ్బందులు పడుతుండటంతో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే, జయంతి బాధపడుతున్న లక్షణాలను పరిగణనలోకి తీసుకున్న వైద్యులు కరోనా పరీక్షలు చేయించినట్టు తెలుస్తోంది. ఈ పరీక్షల్లో ఆమెకు […]

Update: 2020-07-08 08:01 GMT

దిశ, వెబ్ డెస్క్: తనదైన నటనతో దక్షిణాదిలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోనై ఆసుపత్రిలో చేరారు. ఆమె గత కొంతకాలంగా ఉబ్బసం వ్యాధితో బాధపడుతోంది. పరిస్థితి విషమించడంతో బుధవారం కుటుంబ సభ్యులు బెంగుళూరు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం శ్వాస తీసుకోవడానికి ఆమె ఇబ్బందులు పడుతుండటంతో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే, జయంతి బాధపడుతున్న లక్షణాలను పరిగణనలోకి తీసుకున్న వైద్యులు కరోనా పరీక్షలు చేయించినట్టు తెలుస్తోంది. ఈ పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా జయంతి తనయుడు కృష్ణకుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆమె కోలుకుంటున్నారని వెల్లడించారు. కాగా 73 ఏళ్ల వయసున్న నటి జయంతి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. చిన్న తనంలో తన అభిమాన నటుడు ఎన్టీ రామారావును చూసేందుకు ఆమె స్టూడియోలకు వెళ్లేవారు. అలా ఈ రంగంపై ఆసక్తి పెంచుకుని నటిగా మారారు.

Tags:    

Similar News