గజ వాహనంపై శ్రీనివాసుడి కనువిందు

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ‌‌‌వారం రాత్రి మలయప్పస్వామి గ‌జ వాహ‌నంపై దర్శనమిచ్చారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహ‌న‌సేవ ద‌ర్శనం వ‌ల్ల క‌ర్మ విముక్తి క‌లుగుతుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి […]

Update: 2020-10-21 11:52 GMT

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ‌‌‌వారం రాత్రి మలయప్పస్వామి గ‌జ వాహ‌నంపై దర్శనమిచ్చారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహ‌న‌సేవ ద‌ర్శనం వ‌ల్ల క‌ర్మ విముక్తి క‌లుగుతుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.

మ‌ధ్యాహ్నం కల్యాణోత్సవం మండ‌పంలో రుక్మిణి సత్యభామ స‌మేత గోవర్ధనగిరి దారుడైన శ్రీకృష్ణుని అలంకారంలో మ‌ల‌య‌ప్పస్వామి పుష్పక విమానంలో అభ‌య‌మిచ్చారు. పుష్పక విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సంద‌ర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేస్తారు. ఉదయం మలయప్పస్వామి ధ‌న‌స్సు ధ‌రించి కోదండ‌రాముని అలంకారంలో దర్శనమిచ్చారు.

Tags:    

Similar News