‘హాత్ వే రాజశేఖర్’ ఇకలేరు..
దిశ, వెబ్‌డెస్క్ : అసలుపేరు చెలికాని రాజశేఖర్ కాగా, అందరూ ఆయన్ను ‘హాత్ వే రాజశేఖర్’గా పిలుచుకుంటారు. కేబుల్ టీవీ రంగంలో అందరికీ సుపరిచితుడు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ అనుకోకుండా కాలం చేశారు. శనివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కేబుల్ టీవీ రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. 1968 ఏప్రిల్ 4న విజయనగరం జిల్లా సీతానగరంలో జన్మించిన ఆయన తొలిసారి […]
దిశ, వెబ్‌డెస్క్ : అసలుపేరు చెలికాని రాజశేఖర్ కాగా, అందరూ ఆయన్ను ‘హాత్ వే రాజశేఖర్’గా పిలుచుకుంటారు. కేబుల్ టీవీ రంగంలో అందరికీ సుపరిచితుడు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ అనుకోకుండా కాలం చేశారు. శనివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కేబుల్ టీవీ రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. 1968 ఏప్రిల్ 4న విజయనగరం జిల్లా సీతానగరంలో జన్మించిన ఆయన తొలిసారి వైజాగ్‌లో కేబుల్ రంగంలోకి అడుగుపెట్టారు.
అనతి కాలంలోనే హైదరాబాద్ వేదికగా మొదలైన ‘హాత్ వే’లో రీజినల్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. హాత్ వేను రాష్ట్రంలో ప్రముఖ నెట్ వర్క్‌గా తీర్చిదిద్దారు. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో హాత్ వే విస్తరణలో ఆయనదే కీలకపాత్ర. తొలిసారి ఎమ్మెస్వోల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి వారి బాగుకోసం శ్రమించారు.
అంతేకాకుండా ఏపీ ఎమ్మెస్వో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా కూడా రాజశేఖర్ పనిచేశారు. ప్యాకేజీల పేరుతో చానల్స్ ఎంఎస్‌వోలను వేధించిన సమయంలో ఆయన అనేక ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వాలతో చర్చలు జరిపి ఎమ్మెస్ఓలు, ఆపరేటర్లు నష్టపోకుండా చూశారు. అలాంటి వ్యక్తి మరణం కేబుల్ రంగానికి తీరని లోటని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తంచేశారు.