ముగ్గురు ప్రజాప్రతినిధులు సస్పెన్షన్

దిశ, వరంగల్: ఆ ముగ్గురు గ్రామ ప్రజాప్రతినిధులు. వారు నిధులు దుర్వినియోగం చేసినట్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో కలెక్టర్ వారిపై విచారణ జరిపారు. గ్రామ సభ తీర్మాణాలు, ఎంబీలు లేకుండానే నిధులు డ్రా చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఈ వ్యవహారంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సదరు నేతలకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఆ నేతలు ఇచ్చిన వివరణతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం వారిని […]

Update: 2020-05-28 03:49 GMT

దిశ, వరంగల్: ఆ ముగ్గురు గ్రామ ప్రజాప్రతినిధులు. వారు నిధులు దుర్వినియోగం చేసినట్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో కలెక్టర్ వారిపై విచారణ జరిపారు. గ్రామ సభ తీర్మాణాలు, ఎంబీలు లేకుండానే నిధులు డ్రా చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఈ వ్యవహారంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సదరు నేతలకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఆ నేతలు ఇచ్చిన వివరణతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకీ ఆ నేతలు ఎవరో తెలసుకుందాం. ములుగు జిల్లా వెంకటాపురం మండల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు. వీరు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడికావడంతో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News