కేంద్ర నిధులను సద్వినియోగం చేయాలి: మంత్రి వేముల

దిశ, నిజామాబాద్: కేంద్రం ద్వారా వచ్చే ఉపాధి హామీ లేబర్ కాంపోనెంట్ నిధులను ఇతర శాఖలకు అనుసంధానం చేసి సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల పరిశుభ్రత, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలకు పక్కా ప్రణాళికతలో పంచాయతీ అధికారులు పని చేయాలని కోరారు. భవిష్యత్తులో రోడ్డు భవనాల శాఖ, నీటి పారుదల శాఖ, ఆటవీ […]

Update: 2020-06-19 06:42 GMT

దిశ, నిజామాబాద్: కేంద్రం ద్వారా వచ్చే ఉపాధి హామీ లేబర్ కాంపోనెంట్ నిధులను ఇతర శాఖలకు అనుసంధానం చేసి సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల పరిశుభ్రత, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలకు పక్కా ప్రణాళికతలో పంచాయతీ అధికారులు పని చేయాలని కోరారు. భవిష్యత్తులో రోడ్డు భవనాల శాఖ, నీటి పారుదల శాఖ, ఆటవీ శాఖ, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో నరేగా నిధులు వాడుకోవాలని నిర్ణయించామన్నారు.

Tags:    

Similar News