ఐదు వేల ఎకరాలకు ఓ క్లస్టర్: వేముల
దిశ, నిజామాబాద్: రైతులు సంఘటితమై.. పంటలను మంచి ధరకు అమ్ముకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జనహిత భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి, జిల్లాలో వంద క్లస్టర్స్‌కు రైతు వేదికలు నిర్మిస్తామన్నారు. క్లస్టర్‌కు ఒక వ్యవసాయ అధికారి ఉండి.. రైతులకు సహాయ సహకారాలు అందిస్తారని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.12 లక్షల ఎకరాల్లో వరి, మొక్క […]
దిశ, నిజామాబాద్: రైతులు సంఘటితమై.. పంటలను మంచి ధరకు అమ్ముకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జనహిత భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి, జిల్లాలో వంద క్లస్టర్స్‌కు రైతు వేదికలు నిర్మిస్తామన్నారు. క్లస్టర్‌కు ఒక వ్యవసాయ అధికారి ఉండి.. రైతులకు సహాయ సహకారాలు అందిస్తారని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.12 లక్షల ఎకరాల్లో వరి, మొక్క జొన్న బదులు 20 వేల ఎకరాల్లో సోయా, 30 వేల ఎకరాల్లో కందులు, 23వేల ఎకరాల్లో పత్తి, ఐదు వేల ఎకరాల్లో పెసర, మూడు వేల ఎకరాల్లో మినుములు పండించాలని ప్రణాళికలు రూపొందించినట్టు మంత్రి వెల్లడించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు 99 శాతం పూర్తయిందన్నారు.