సెప్టెంబర్‌లో వాహన రిటైల్ అమ్మకాల క్షీణత!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆటోమొబైల్ పరిశ్రమలో రిటైల్ అమ్మకాలు భారీగా క్షీణించాయి. సమీక్షించిన నెలలో మొత్తం 12,96,257 వాహనాలు అమ్ముడయ్యాయని, ముఖ్యంగా కార్లు, కమర్షియల్ వాహనాల అమ్మకాలు పెరిగాయి. అయితే, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా పడిపోయాయని ప్రముఖ ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్(ఫాడా) గురువారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో రిటైల్ వాహనాల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 5 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయని ఫాడా తెలిపింది. ముఖ్యంగా టూ-వీలర్, […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆటోమొబైల్ పరిశ్రమలో రిటైల్ అమ్మకాలు భారీగా క్షీణించాయి. సమీక్షించిన నెలలో మొత్తం 12,96,257 వాహనాలు అమ్ముడయ్యాయని, ముఖ్యంగా కార్లు, కమర్షియల్ వాహనాల అమ్మకాలు పెరిగాయి. అయితే, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా పడిపోయాయని ప్రముఖ ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్(ఫాడా) గురువారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో రిటైల్ వాహనాల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 5 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయని ఫాడా తెలిపింది. ముఖ్యంగా టూ-వీలర్, ట్రాక్టర్ల అమ్మకాలు భారీగా క్షీణించాయని ఫాడా పేర్కొంది.
ఫాడా నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ నెలలో మొత్తం అమ్మకాల్లో 10,33,895 ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయాయి. అంతకుముందు నెలతో పోలిస్తే 11.54 శాతం తగ్గాయి. ఇక, ట్రాక్టర్ అమ్మకాలు 23.85 శాతం తగ్గి 52,896 వాహనాలు విక్రయించబడ్డాయి. కరోనా సమయంలోను మెరుగ్గా ఉన్న ట్రాక్టర్ అమ్మకాలు ఈసారి తగ్గడం గమనార్హం. కార్ల అమ్మకాలు 16.32 శాతం పెరిగి 2,33,308 వాహనాలు అమ్ముడయ్యాయి. కమర్షియల్ వాహనాలు 46.64 శాతం వృద్ధితో 36,612 యూనిట్లు విక్రయించబడ్డాయి. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య మొత్తం 71,85,561 యూనిట్ల రిటైల్ అమ్మకాలు నమోదయ్యాయని, ఇది గతేడాదితో పోలిస్తే 35 శాతం ఎక్కువని ఫాడా వెల్లడించింది.