‘బనానా గర్ల్’ డైట్ సీక్రెట్..తెలుసా?

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు ఆమెకు ముక్క లేనిదే ముద్ద దిగేది కాదు. దాంతో ఆమె బరువు కూడా బాగానే పెరిగింది. 20 ఏండ్ల వయసులోనే వెయిట్ పెరగడంతో 40ఏండ్ల వయసు ఉన్నట్లు కనిపించేది. అలాంటి ఆ టీనేజర్ ఒక్కసారిగా నాన్‌వెజ్ విడిచిపెట్టి ప్యూర్ వెగాన్‌గా మారిపోయింది. ఆ ‘బనానా గర్ల్’కు ఇప్పుడు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఆమె తన డైట్ సీక్రెట్ రివీల్ చేసింది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాకు […]

Update: 2020-10-09 03:04 GMT

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు ఆమెకు ముక్క లేనిదే ముద్ద దిగేది కాదు. దాంతో ఆమె బరువు కూడా బాగానే పెరిగింది. 20 ఏండ్ల వయసులోనే వెయిట్ పెరగడంతో 40ఏండ్ల వయసు ఉన్నట్లు కనిపించేది. అలాంటి ఆ టీనేజర్ ఒక్కసారిగా నాన్‌వెజ్ విడిచిపెట్టి ప్యూర్ వెగాన్‌గా మారిపోయింది. ఆ ‘బనానా గర్ల్’కు ఇప్పుడు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఆమె తన డైట్ సీక్రెట్ రివీల్ చేసింది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆస్ట్రేలియాకు చెందిన ఆమె పేరు లియాన్నె ర్యాట్‌క్లిఫె. 25 ఏండ్ల వయసు వరకు నాన్‌వెజ్‌ను ఎంతో ఇష్టంగా తినేది. నాన్‌వెజ్ తినందే రోజు గడిచేది కాదు. కానీ, అనూహ్యంగా ర్యాట్ క్లిఫె ఒక్కసారిగా తన డైట్ చేంజ్ చేసుకుని ఆరోగ్యం మీద దృష్టి పెట్టింది. వెగాన్‌గా మారిపోయి తాజా పళ్లు, కూరగాయాలు తింటూ తన ఆరోగ్యాన్నే కాదు బరువును కూడా తగ్గించుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ‘రా అంటిల్ ఫోర్’ అంటూ ఇటీవలే తన డైట్ సీక్రెట్ చెప్పింది ర్యాట్. మరి రా అంటిల్ ఫోర్ అంటే..ఏమిటంటే..సాయంత్రం నాలుగింటి వరకు నో కుక్డ్ లేదా హీటెడ్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలని అర్థం. అందుకోసం ఆమె రోజూ ఉదయం మార్నింగ్ టిఫిన్‌గా హాఫ్ వాటర్ మిలాన్ తీసుకుంటోంది. మధ్యాహ్న భోజనంగా వెగాన్ ఐస్‌క్రీమ్ లాగించేస్తుంది. రోజూ '15 అరటిపండ్లను బ్లెండ్ చేసి..స్మూతీగా చేసుకుని తాగేస్తుంది. ఇక రాత్రి పూట వివిధ రకాల కూరగాయ ముక్కలను కొబ్బరి చట్నీలో అద్దుకొని తింటుంది. ఆమె రోజు తినే ఆహారం మొత్తం కలసి 2,700 కాలరీలు మాత్రమే. పండ్లు, పచ్చి లేదా ఉడికించిన కూరగాయాలే ఆమె ఆహారం. దాదాపు 14 ఏండ్లుగా ఆమె తీసుకుంటున్న డైట్‌ ఇదే! అందుకే ఆమె పాతికేళ్ల వయసులో ఉన్నప్పటికీ , ఇప్పటికి 18 కిలోలు తగ్గింది.

‘మీరు బతికి ఉండాలంటే.. మీ శరీరాన్ని ఫ్రిడ్జిలా మార్చేయకండి. దాన్ని జంతువుల కళేబారాలతో నింపేయకండి’ అని ర్యాట్ క్లిఫే అంటోంది. ర్యాట్ క్లిఫే వెగాన్‌గా మారిన తొలిరోజుల్లో రోజుకి 51 అరటిపండ్లను తింటానని చెప్పింది. అయితే, తర్వాత చాలా తగ్గించాను అని, ప్రస్తుతం 15 మించి తినడం లేదని చెప్పింది. అందుకే నెటిజన్లు, ఇతరుల ర్యాట్ క్లిఫేను ‘బనానా గర్ల్’‌గా సంబోధిస్తారు. ర్యాట్‌క్లిఫేకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 30 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ర్యాట్ క్లిఫే జన్మించింది.

Tags:    

Similar News