వీణా వాణీలకు విడివిడి పేపర్లు

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవిభక్త కవలలు వీణా వాణీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారు పుట్టినప్పటి నుంచి ప్రతి విషయాన్ని మీడియా ద్వారా ఎప్పటికప్పుడూ ఇరు రాష్ట్రాల ప్రజలు తెలుసుకుంటూనే ఉన్నారు. 2003లో జన్మించిన వీరు ఈ ఏడాది మార్చిలో పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. అయితే పరీక్షల సమయంలో వారిని ఒక్కరిగా పరిగణించి ఒక్క పేపరు ఇవ్వాలా? లేక ఇద్దరుగా అనుకుని రెండు పేపర్లు ఇవ్వాలా? […]

Update: 2020-02-23 04:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవిభక్త కవలలు వీణా వాణీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారు పుట్టినప్పటి నుంచి ప్రతి విషయాన్ని మీడియా ద్వారా ఎప్పటికప్పుడూ ఇరు రాష్ట్రాల ప్రజలు తెలుసుకుంటూనే ఉన్నారు. 2003లో జన్మించిన వీరు ఈ ఏడాది మార్చిలో పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. అయితే పరీక్షల సమయంలో వారిని ఒక్కరిగా పరిగణించి ఒక్క పేపరు ఇవ్వాలా? లేక ఇద్దరుగా అనుకుని రెండు పేపర్లు ఇవ్వాలా? అని జిల్లా విద్యారంగ అధికారులు సతమతవుతున్నారు. ఒకే మెదడు రెండు శరీరాలతో ఉన్న వీరికి రెండు పేపర్లు ఇవ్వాలని చర్చోపచర్చల తర్వాత నిర్ణయం తీసుకున్నారు. అయితే వీళ్లిద్దరి పేపర్లలో జవాబులు ఎలా ఉండబోతాయనే అంశం త్వరలో చర్చనీయాంశం కాబోతోంది.

ప్రస్తుతం వాళ్లు నివసిస్తున్న హైదరాబాద్‌లోని స్టేట్ హోం వారికి ప్రత్యేక తరగతుల ద్వారా విద్యా శాఖ బోధన కల్పిస్తోంది. వీరి పరిస్థితి గురించి జిల్లా విద్యాధికారి వేంకట నర్సమ్మ మాట్లాడుతూ వీరి అంశాన్ని రాష్ట్రం దృష్టికి తీసుకెళ్తే పిల్లల ఇష్టప్రకారమే పరీక్షలు నిర్వహించాలని చెప్పినట్లు తెలిపారు. ఒకవేళ అవసరమైతే వీరికి స్క్రైబ్ సాయం కూడా కల్పించేందుకు సిద్ధమని అన్నారు. మహబూబాబాద్ జిల్లా బీరిశెట్టిగూడెంకి చెందిన మురళి, నాగలక్ష్మిల పిల్లలైన వీరిని 12 ఏళ్ల వయసులో నీలోఫర్ ఆసుపత్రి నుంచి స్టేట్ హోంకి పంపించారు. అప్పట్నుంచి సోషల్ వెల్ఫేర్ శాఖ వీరి బాగోగులను చూస్తోంది.

వీరికి సర్జరీ చేసి రూ. 10 కోట్లు ఖర్చువుతాయని, అందుకు సాయపడాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని అర్థిస్తోన్న సంగతి తెలిసిందే. కానీ ఇద్దరు పిల్లలు ఒక ప్రధానమైన రక్తనాళాన్ని పంచుకుని పుట్టడం వల్ల సర్జరీ చేయడం వల్ల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశముందని, దీని గురించి మరింత అధ్యయనం చేసేందుకు సమయం కావాలని అప్పట్లో లండన్ డాక్టర్లు చెప్పారు.

Read also..

ఏసీపీ సైకిల్ సవారీ..

Full View

Tags:    

Similar News