రూ.141 కోట్ల మోసానికి పాల్పడ్డ బాలీవుడ్ నటుడు

దిశ, సినిమా : టీవీ యాక్టర్, ఎల్డర్ ఫార్మాస్యూటికల్స్ COO అంజు సక్సేనా అరెస్టయ్యారు. పెట్టుబడిదారులను రూ. 141 కోట్ల మేర మోసంచేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న తనను ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్(EOW) గురువారం అరెస్ట్ చేసింది. రుణదాతలు, పెట్టుబడిదారులకు చెల్లింపుల ఎగవేతకు పాల్పడినందున సక్సేనా, అతని సోదరుడిపై పలు సెక్షన్లపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ ఫ్రాడ్‌కు సంబంధించి కంపెనీ సీవోవోగా సక్సేనా పాత్రను విచారించేందుకు తనను కస్టడీకి అప్పగించాల్సిందిగా EOW కోరింది. అయితే తను […]

Update: 2021-05-01 02:26 GMT

దిశ, సినిమా : టీవీ యాక్టర్, ఎల్డర్ ఫార్మాస్యూటికల్స్ COO అంజు సక్సేనా అరెస్టయ్యారు. పెట్టుబడిదారులను రూ. 141 కోట్ల మేర మోసంచేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న తనను ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్(EOW) గురువారం అరెస్ట్ చేసింది. రుణదాతలు, పెట్టుబడిదారులకు చెల్లింపుల ఎగవేతకు పాల్పడినందున సక్సేనా, అతని సోదరుడిపై పలు సెక్షన్లపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ ఫ్రాడ్‌కు సంబంధించి కంపెనీ సీవోవోగా సక్సేనా పాత్రను విచారించేందుకు తనను కస్టడీకి అప్పగించాల్సిందిగా EOW కోరింది. అయితే తను ఒక మెడికల్ ప్రాక్టీషనర్ అని.. అంతేకాకుండా కిట్స్, శానిటైజర్స్ తయారుచేసే కంపెనీని కలిగివున్నందున ఈ పాండమిక్ సమయంలో తన అవసరం ఉందని కోర్టుకు విన్నవించాడు. అయితే ఈ వ్యవహారం గురించి సక్సేనాకు తప్పకుండా తెలిసే ఉంటుందన్న EOW వాదనతో ఏకీభవించిన కోర్టు.. తనను కస్టడీకి అప్పగించేందుకు సమ్మతించింది.

కాగా ఈ టీవీ నటుడిపై చీటింగ్, క్రిమినల్ కాన్‌స్పిరసీ చార్జెస్ మరియు మహారాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్ యాక్ట్, 1999లోని సెక్షన్లపై పలు కేసులు బుక్ చేశారు. 2012లో తమ కంపెనీలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెట్టుబడులు పెడితే, లాభదాయక రాబడులు వస్తాయని హామీ ఇవ్వడంతో ఇన్వెస్ట్ చేసి మోసపోయిన ఓ పెట్టుబడిదారుడు ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా సక్సేనాపై కేసులను నమోదు చేశారు. 2015లో డిపాజిట్ మెచ్యూర్ అయిన తర్వాత, కంపెనీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. హామీఇచ్చిన మేరకు మొత్తం డబ్బులు చెల్లిస్తామని సక్సేనా నుంచి చివరగా 2015లో రాతపూర్వక సమాధానం అందిన తర్వాత ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదని, పెట్టుబడిదారులకు ఎలాంటి డబ్బు అందలేదని తెలిపారు.

ఈ క్రమంలో ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదుచేయబడిన సక్సేనా సోదరుడు అలోక్ 2017లో మరణించడంతో అతనిపై కేసు కొట్టివేయబడింది. కాగా తను ఫార్మాస్యూటికల్ కంపెనీ సీవోవోగా 2015లో మాత్రమే ఉన్నానని, అంతకుమందు వ్యవహారాల గురించి తనకు తెలియదని సక్సేనా వెల్లడించారు. కాగా 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీ బ్యాలన్స్ ఫీట్ల నుంచి రూ. 1500 కోట్లను తగ్గించడంపై EOW విచారణ చేపట్టనుంది.

 

Tags:    

Similar News