ప్రకృతి విపత్తులను గుర్తించే సెన్సార్
దిశ, ఫీచర్స్: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఇటీవలే గంగా నదికి ఉపనదులైన దౌలిగంగ, అలకనంద ఉప్పొంగడంతో జల ప్రళయం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సమీపంలోని రిషిగంగ పవర్ ప్రాజెక్టులో పని చేస్తున్న సుమారు 150 మంది గల్లంతు కాగా, 55 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే నదులు లేదా ప్రాజెక్టుల వద్ద ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి, హెచ్చరించే విధంగా సెన్సార్‌లు ఉండుంటే.. ఆస్తి, ప్రాణనష్టం కొంతమేర తగ్గేది. ఈ నేపథ్యంలోనే వారణాసికి చెందిన […]
దిశ, ఫీచర్స్: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఇటీవలే గంగా నదికి ఉపనదులైన దౌలిగంగ, అలకనంద ఉప్పొంగడంతో జల ప్రళయం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సమీపంలోని రిషిగంగ పవర్ ప్రాజెక్టులో పని చేస్తున్న సుమారు 150 మంది గల్లంతు కాగా, 55 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే నదులు లేదా ప్రాజెక్టుల వద్ద ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి, హెచ్చరించే విధంగా సెన్సార్‌లు ఉండుంటే.. ఆస్తి, ప్రాణనష్టం కొంతమేర తగ్గేది. ఈ నేపథ్యంలోనే వారణాసికి చెందిన ఓ ముగ్గురు విద్యార్థులు.. ఇలాంటి సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా ఒక వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు.
వారణాసిలోని ‘అశోక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్’కు చెందిన ముగ్గురు విద్యార్థినులు.. హిమానీనదాల వల్ల సంభవించే వరదలను గుర్తించి, అలర్ట్ చేసేందుకు ఓ సెన్సార్‌ను రూపొందించారు. కాగా ఉత్తరాఖండ్ జలవిలయం వల్ల చాలామంది చనిపోయారని, అలా కాకుండా ముందస్తుగానే ప్రజలను అలర్ట్ చేసేందుకు ఈ సెన్సార్ రూపొందించినట్లు విద్యార్థినులు తెలిపారు. ఈ సెన్సార్ అలారం తయారీకి రూ.8 వేలు ఖర్చు కాగా, 500 మీటర్ల రేంజ్ వరకు వినిపిస్తుందని, ఇంకా రేంజ్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ రీచార్జబుల్ సెన్సార్ అలారం ప్రకృతి విపత్తులు, హిమపాతాలతో కూడిన ప్రళయాలు, వరదలను ముందుగానే గుర్తించి ప్రజలను కాపాడుతుందని అశోక ఇన్‌స్టిట్యూట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెల్ ఇన్‌చార్జి శ్యామ్ చౌరాసియా అన్నారు. ఒకసారి చార్జ్ చేస్తే 6 నెలలపాటు ఉపయోగించేలా సెన్సార్ అలారం రూపొందించిన విద్యార్థినుల కృషిని ఆయన అభినందించారు.