ఈరోజు గూగుల్ స్పెషల్ డూడుల్.. కేవలం చూడటానికి కాదు, ఆడటానికి కూడా!

ఈ ఇంటర్నెట్ యుగంలో ప్రతి ఒక్కరు రోజులో ఒక్కసారైనా గూగుల్ (Google) ఒపెన్ చేసి తెలియని విషయాలను సెర్చ్ చేసి తెలుసుకుంటారు.

Update: 2025-04-24 09:28 GMT
ఈరోజు గూగుల్ స్పెషల్ డూడుల్.. కేవలం చూడటానికి కాదు, ఆడటానికి కూడా!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఈ ఇంటర్నెట్ యుగంలో ప్రతి ఒక్కరు రోజులో ఒక్కసారైనా గూగుల్ (Google) ఒపెన్ చేసి తెలియని విషయాలను సెర్చ్ చేసి తెలుసుకుంటారు. ఇక గూగుల్ ఒపెన్ చేసినప్పుడు హోమ్ పేజీలో సాధారణ లోగో స్థానంలో కొన్నిసార్లు ప్రత్యేకమైన థీమ్‌లతో కార్టూన్ చిత్రాలు కనిపిస్తుంటాయి. వీటినే గూగుల్ డూడుల్స్ (Google Doodles) అంటారు. ప్రత్యేకమైన రోజుల్లో సందర్భానికి తగినట్లు గూగుల్ ఈ మార్పులు చేస్తుంటుంది. ఇవి ఫన్నీగా, ఆశ్చర్యకరంగా, ఇంటరాక్టివ్‌గా ఉంటాయి. ఈ నేపథ్యంలో గూగుల్ ఈరోజు (ఏప్రిల్ 24) కూడా ఓ ప్రత్యేకమైన డూడుల్‌ను ప్రవేశపెట్టింది. ఇది కేవలం చూసేందుకే కాదు.. ఇందులో ఫజిల్ గేమ్ కూడా ఆడుకోవచ్చు. మరీ ఈ డూడుల్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా.

టెక్ దిగ్గజ సంస్థ గూగుల్.. ఇవాళ ఏప్రిల్ నెల చివరి అర్ధ చంద్రుని అందాన్ని పురస్కరించుకుని ఒక కొత్త డూడుల్‌తో వచ్చింది. దీనిపేరు 'రైజ్ ఆఫ్ ది హాఫ్ మూన్'. అలాగే, ఈ పింక్ మూన్ అనేది వసంత ఋతువులో కనిపించే ఒక ప్రత్యేకమైన చంద్రుని దశ. ఇక ఈ డూడుల్‌లో మీరు ఒక చిన్న ఆట కూడా ఆడవచ్చు. ఇందులో 3x3 కాస్మిక్ కార్డులతో బోర్డు ఉంటుంది. అందులో చంద్రుని దశల కార్డులను జత చేయాలి. రెండు సరిగా కలిపితే పూర్తి చంద్రుడు అవుతుంది. ఆటలో ముందుకెళ్లేందుకు ఇవి అవసరం. మొత్తం మూడు స్థాయిలు ఉంటాయి. ఒక్కో స్థాయి కాస్త కష్టంగా మారుతుంటుంది. చివరి స్థాయి పూర్తిచేసిన వారికి ప్రత్యేకమైన కార్డులు (వైల్డ్‌కార్డ్స్) బహుమతిగా లభిస్తాయి.

గూగుల్ హోమ్ పేజీకి వెళితే, అక్కడ ఉన్న డూడుల్‌పై క్లిక్ చేస్తే ఆట మొదలవుతుంది. ఈ ఆట ద్వారా చంద్రుడి వాక్సింగ్, వానింగ్ దశలను నేర్చుకోవచ్చని గూగుల్ చెబుతోంది. సాధారణంగా చాలామందికి అర్ధ చంద్రుడు అంటే చంద్రుడి సగం కనిపిస్తుందని అనుకుంటారు. కానీ, నిజానికి అది క్వార్టర్ మూన్.. అంటే చంద్రుడి నాలుగవ భాగం మాత్రమే ప్రకాశిస్తోంది. మొదటి క్వార్టర్ తరువాత చంద్రుడు వాక్సింగ్ గిబ్బస్ దశలోకి వెళ్తాడు. అంటే.. ఎక్కువ వెలుతురు వచ్చేస్తుంది. చివరి క్వార్టర్ తరువాత వానింగ్ గిబ్బస్ దశలోకి వెళ్తాడు. అంటే.. వెలుతురు తగ్గుతూ న్యూ మూన్ (చంద్రుడు కనబడని దశ) వస్తుంది.

Tags:    

Similar News