వాళ్ల పోరాటమంతా కుర్చీ కోసమే.. వంటేరు ప్రతాప్ రెడ్డి ఆగ్రహం

దిశ, గజ్వేల్: టీఆర్ఎస్ సర్కార్‌లో ఎలాంటి అవినీతికి తావులేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా 57 ఏండ్లు నిండిన వారికి ప్రభుత్వం పెన్షన్ అందజేస్తోందన్నారు. ప్రతీ గ్రామాన్ని ప్రభుత్వం ఏడాదికి రూ. 12 కోట్లలో అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ప్రజలకు ఏం కావాలో అడగకుండా, ప్రతిపక్షాలు కుర్చీ కోసం పోరాటాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకడు దీక్ష అంటే మరొకడు పాదయాత్రలు […]

Update: 2021-08-31 07:42 GMT

దిశ, గజ్వేల్: టీఆర్ఎస్ సర్కార్‌లో ఎలాంటి అవినీతికి తావులేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా 57 ఏండ్లు నిండిన వారికి ప్రభుత్వం పెన్షన్ అందజేస్తోందన్నారు. ప్రతీ గ్రామాన్ని ప్రభుత్వం ఏడాదికి రూ. 12 కోట్లలో అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ప్రజలకు ఏం కావాలో అడగకుండా, ప్రతిపక్షాలు కుర్చీ కోసం పోరాటాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఒకడు దీక్ష అంటే మరొకడు పాదయాత్రలు అంటూ జనాలను ఆందోళనకు గురిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. చిన్నా పెద్ద మర్యాద లేకుండా మాట్లాడుతూ రాజకీయాలను ఆగం చేస్తున్నారని తెలిపారు.

తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని అంటున్న షర్మిల, ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ఏం పాలన చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు ఆలోచన చేయాలన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ నుండి 12 వరకు టీఆర్ఎస్ గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ గ్రామంలో గులాబీ జెండా ఎగురవేసి పండుగ జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News