బొగ్గు కంపెనీల్లో ‘వనమహోత్సవ్‌’

దిశ, న్యూస్​బ్యూరో: దేశంలోని బొగ్గు పరిశ్రమలన్నీ ఈ ఏడాది ‘వన మహోత్సవ్‌’ కార్యక్రమం పేరుతో పెద్దఎత్తున మొక్కలు నాటాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఆదేశించింది. న్యూఢిల్లీ నుంచి కేంద్ర బొగ్గుశాఖ ప్రత్యేక కార్యదర్శి అనిల్‌ కుమార్‌ జైన్‌ కోలిండియా, సింగరేణి తదితర బొగ్గు లిగ్నైట్‌ కంపెనీ ఛైర్మన్‌, ఎండీలతో ‘వనమహోత్సవ్‌’పై బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పాల్గొన్నారు. ప్రతీ బొగ్గు ఉత్పత్తి సంస్థ విధిగా మొక్కలు నాటాలని కేంద్ర […]

Update: 2020-07-15 11:24 GMT

దిశ, న్యూస్​బ్యూరో: దేశంలోని బొగ్గు పరిశ్రమలన్నీ ఈ ఏడాది ‘వన మహోత్సవ్‌’ కార్యక్రమం పేరుతో పెద్దఎత్తున మొక్కలు నాటాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఆదేశించింది. న్యూఢిల్లీ నుంచి కేంద్ర బొగ్గుశాఖ ప్రత్యేక కార్యదర్శి అనిల్‌ కుమార్‌ జైన్‌ కోలిండియా, సింగరేణి తదితర బొగ్గు లిగ్నైట్‌ కంపెనీ ఛైర్మన్‌, ఎండీలతో ‘వనమహోత్సవ్‌’పై బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పాల్గొన్నారు. ప్రతీ బొగ్గు ఉత్పత్తి సంస్థ విధిగా మొక్కలు నాటాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి అనిల్‌ కుమార్‌ జైన్‌ కోరారు. కోలిండియా పరిధిలో గల 8బొగ్గు ఉత్పత్తి కంపెనీలు అన్నీ కలిసి ఈ కార్యక్రమంలో 40లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా.. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ మాట్లాడుతూ తమ కంపెనీ తరపున 35లక్షల మొక్కలు నాటనున్నామని తెలియజేశారు. సింగరేణి సంస్థ ఐదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంలో ఏడాదికి 65 నుంచి 70 లక్షల మొక్కలు స్వయంగా నాటుతోందని, 30లక్షల మొక్కలను సమీప గ్రామాలకు ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. కేంద్ర బొగ్గు శాఖ ప్రత్యేక కార్యదర్శి అనిల్‌ కుమార్‌ జైన్‌ సింగరేణికి తన అభినందనలు తెలిపారు. ‘వనమహోత్సవ్‌’ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ చివరి నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో సింగరేణి అడ్వయిజర్‌ (ఫారెస్ట్రీ) కె..సురేంద్రపాండే, డైరెక్టర్‌ (పి&పి) బి.భాస్కర్‌ రావు , జనరల్‌ మేనేజర్‌ కో-ఆర్డినేషన్‌ కె.రవిశంకర్‌, కోలిండియా సిఎండీ ప్రమోద్‌ అగర్వాల్‌, వివిధ రాష్ట్రాల నుంచి కోల్‌ సబ్సిడరీ ఛైర్మన్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News