'రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి'

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నాంపల్లిలోని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు వంశీచంద్, కొండ విశ్వేశ్వరరెడ్డి, మల్లు రవి, చల్లా నర్సింహారెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ… సచివాలయంలో కోవిడ్-19 స్పెషల్ ఆస్పత్రిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిల్లో కనీస వసతులు లేకపోవడంతో ప్రజలు […]

Update: 2020-06-30 02:53 GMT

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నాంపల్లిలోని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు వంశీచంద్, కొండ విశ్వేశ్వరరెడ్డి, మల్లు రవి, చల్లా నర్సింహారెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ… సచివాలయంలో కోవిడ్-19 స్పెషల్ ఆస్పత్రిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిల్లో కనీస వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగాల భర్తీపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News