కలకలం సృష్టిస్తున్న శ్రీనివాస్ ఫోన్ కాల్ రికార్డ్

దిశ, వెబ్‌డెస్క్ : హైకోర్టు న్యాయవాది వామన్ రావు, నాగమణి దంపతుల హత్యకు ముందు బయటకు వచ్చిన ఓ ఆడియో టేప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కులదేవత గుడి వివాదమే ఈ హత్యలకు దారి తీసినట్లు ఆ ఆడియో క్లిప్ ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు. వామన్ రావు హత్య కేసులో ఆరోపణలు ఎదర్కొంటున్న కుంటా శ్రీనివాస్ కాల్ డేటాను పోలీసులు అనాలసిన్ చేయడంతో ఈ ఆడియో క్లిప్ బయటపడింది. ‘కులదేవత గుడి కూల్చేస్తే.. వామన్ […]

Update: 2021-02-18 00:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైకోర్టు న్యాయవాది వామన్ రావు, నాగమణి దంపతుల హత్యకు ముందు బయటకు వచ్చిన ఓ ఆడియో టేప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కులదేవత గుడి వివాదమే ఈ హత్యలకు దారి తీసినట్లు ఆ ఆడియో క్లిప్ ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు. వామన్ రావు హత్య కేసులో ఆరోపణలు ఎదర్కొంటున్న కుంటా శ్రీనివాస్ కాల్ డేటాను పోలీసులు అనాలసిన్ చేయడంతో ఈ ఆడియో క్లిప్ బయటపడింది. ‘కులదేవత గుడి కూల్చేస్తే.. వామన్ రావు కూలిపోతాడని’ ఆ ఆడియోలో కుంటా శ్రీనివాస్ హెచ్చరించినట్లు ఉన్నది. దీనిపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఆయన కాల్ డేటా ఆధారంగా కుమార్, చిరంజీవి, దాస్ అనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య సమయంలో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

కాగా కుంటా శ్రీనివాస్ గతంలో సికాసలో పని చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఆయనపై ఇప్పటికే భూకబ్జా, బెదిరింపులు కేసులు ఉన్నట్లు తెలిపారు. శ్రీనివాస్ ను త్వరలో అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. వామన్ రావు హత్యపై పూర్తి వివరాలను వెల్లడించడానికి ఈరోజు సాయంత్రం రామగుండం సీపీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు పోలీసులు చెప్పారు.

కారులో న్యాయవాది దంపతుల నరికివేత..

Tags:    

Similar News