వామన్ రావు కేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు
దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజ్ వద్ద రెండు రోజులుగా పోలీసులు పడ్డ శ్రమకు ప్రతిఫలం దక్కింది. వామన్ రావు హత్య అనంతరం నిందితులు బ్యారేజిలో పడేసిన కత్తులు, బట్టలను వెతికేందుకు ఆంధ్ర నుంచి గజ ఈతగాళ్లను పోలీసులు పిలిపించిన సంగతి తెలిసిందే. కాగా నిందితులు వాడిన కత్తులను బ్యారేజి నుంచి వెలికి తీసేందుకు గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమించారు. బ్యారేజీలో నీటి గర్భంలోకి వెళ్లిన తర్వాత బురద ఎక్కువగా ఉందని గజ ఈత […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజ్ వద్ద రెండు రోజులుగా పోలీసులు పడ్డ శ్రమకు ప్రతిఫలం దక్కింది. వామన్ రావు హత్య అనంతరం నిందితులు బ్యారేజిలో పడేసిన కత్తులు, బట్టలను వెతికేందుకు ఆంధ్ర నుంచి గజ ఈతగాళ్లను పోలీసులు పిలిపించిన సంగతి తెలిసిందే. కాగా నిందితులు వాడిన కత్తులను బ్యారేజి నుంచి వెలికి తీసేందుకు గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమించారు. బ్యారేజీలో నీటి గర్భంలోకి వెళ్లిన తర్వాత బురద ఎక్కువగా ఉందని గజ ఈత గాళ్లు చెప్పారు. దీంతో కత్తులను వెలికితీయడం ఇక కష్టమే అని ఒక దశలో అంతా భావించారు.
కాగా పట్టు వదలకుండా ప్రయత్నించడంతో ఈతగాళ్ల శ్రమకు ఫలితం దక్కింది. దీంతో పోలీసుల చేతికి కీలక ఆధారాలు దొరికాయి. హత్య కేసులో నిందితులు ఉపయోగించిన కత్తులు, బట్టలను పోలీసులు రికవరీ చేయగలిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.