ఉస్మానియా సూపరింటెండెంట్‌కు వైద్య శిరోమణి అవార్డు
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వైద్య శిరోమణి అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు సిటిజెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ శనివారం అందుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ప్రతి ఏటా జూలై ఒకటో తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ నుంచి పలు రంగాల్లో విశిష్టమైన సేవలు అందించిన వారిని ఎంపిక చేసి ఈ అవార్డును బహుకరిస్తామన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది సుమారు […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వైద్య శిరోమణి అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు సిటిజెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ శనివారం అందుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ప్రతి ఏటా జూలై ఒకటో తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ నుంచి పలు రంగాల్లో విశిష్టమైన సేవలు అందించిన వారిని ఎంపిక చేసి ఈ అవార్డును బహుకరిస్తామన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది సుమారు 28ఏండ్లుగా వైద్యరంగంలో విశిష్టమైన సేవలు అందిస్తున్న ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్‌ను ఈ అవార్డు కింద ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు. జూలై 1న ఉస్మానియా ఆస్పత్రిలో జరిగే ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ట్రిబ్యునల్ కోర్ట్ మాజీ చైర్మన్ జస్టిస్ వామనరావు చేతుల మీదుగా డాక్టర్ నాగేందర్‌కు అవార్డును ప్రదానం చేయనున్నట్లు రాజనారాయణ ముదిరాజ్ తెలిపారు.