పవర్ గ్రిడ్ లో నిరంతరాయంగా టీకా డ్రైవ్..

దిశ, తెలంగాణ బ్యూరో : పవర్ గ్రిడ్‌లో నిరంతరాయంగా టీకా డ్రైవ్ కొనసాగుతుందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పవర్ గ్రిడ్, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు కొవిడ్ బారిన పడకుండా ఇప్పటివరకు ఎన్నో వ్యాక్సినేషన్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు శాఖ అధికారులు తెలిపారు. నేషనల్ మిషన్‌లో భాగంగా ఈ టీకా డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ మంత్రిత్వశాఖ పేర్కొంది. పాట్నాలోని ప్రాంతీయ ప్రధాన కార్యాలయంలో బుధ, గురువారాలు రెండు […]

Update: 2021-05-21 08:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పవర్ గ్రిడ్‌లో నిరంతరాయంగా టీకా డ్రైవ్ కొనసాగుతుందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పవర్ గ్రిడ్, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు కొవిడ్ బారిన పడకుండా ఇప్పటివరకు ఎన్నో వ్యాక్సినేషన్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు శాఖ అధికారులు తెలిపారు. నేషనల్ మిషన్‌లో భాగంగా ఈ టీకా డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ మంత్రిత్వశాఖ పేర్కొంది.

పాట్నాలోని ప్రాంతీయ ప్రధాన కార్యాలయంలో బుధ, గురువారాలు రెండు రోజులు టీకాల శిబిరం నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ డ్రైవ్ ద్వారా పాట్నాలో ఆర్‌హెచ్‌క్యూ సిబ్బందితో పాటు పాట్నా సబ్ స్టేషన్, బీహార్ గ్రిడ్ కంపెనీ లిమిటెడ్ సిబ్బందికి వ్యాక్సిన్ అందజేసినట్లు తెలిపారు. 350 మందికి పైగా సిబ్బందితో పాటు కుటుంబీకులు, కాంట్రాక్ట్ కార్మికులకు ఈ శిబిరంలో టీకాలు వేశారు. అంతేకాకుండా అరా, బిహార్ షరీఫ్, సహార్సా, ముజఫర్‌పూర్ సబ్ స్టేషన్ల ఉద్యోగులు, కుటుంబీకులు, కాంట్రాక్ట్ కార్మికులు, భద్రతా సిబ్బందికి కూడా టీకా అందించినట్లు తెలిపారు.

Tags:    

Similar News