రాజన్న ఆలయంలో కొవిడ్ వాక్సినేషన్
దిశ, వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కొవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకులకు, అధికారులకు, సిబ్బందికి మంగళవారం కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి మహేష్ రావు తెలిపారు. ఆలయ ప్రాంగణము లోని ఓపెన్ స్లాబ్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వీరందరికీ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి రాజన్న దర్శనార్థం భక్తులు విచ్చేస్తుంటారు. అందుకే […]
దిశ, వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కొవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకులకు, అధికారులకు, సిబ్బందికి మంగళవారం కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి మహేష్ రావు తెలిపారు. ఆలయ ప్రాంగణము లోని ఓపెన్ స్లాబ్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వీరందరికీ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి రాజన్న దర్శనార్థం భక్తులు విచ్చేస్తుంటారు. అందుకే వీరికి కొవిడ్ నుంచి రక్షణ కోసం వ్యాక్సన్ వేసినట్లు వైద్యాధికారి వివరించారు.