వర్చువల్ డేట్‌కు సై అంటున్న వాణీకపూర్

కరోనా వైరస్ ప్రపంచ జీవన గతిని మార్చేసింది. ఎంతోమంది పేదలు జీవనోపాధి కోల్పోయి ఆకలితో పస్తులుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రోజువారీ కూలీలకు భోజనం అందించేందుకు ముందుకొచ్చింది బాలీవుడ్ నటి వాణీకపూర్. ‘ఫ్యాన్ కైండ్’ సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేట్టిన వాణి.. ఇందులో విజేతలుగా నిలిచిన ఐదుగురికి తనతో వర్చువల్ డేటింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ‘దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో సాటి మనుషులుగా మద్దతివ్వాల్సిన అవసరం ఉంది. నా వంతు సాయంగా రోజువారీ […]

Update: 2020-05-30 07:30 GMT

కరోనా వైరస్ ప్రపంచ జీవన గతిని మార్చేసింది. ఎంతోమంది పేదలు జీవనోపాధి కోల్పోయి ఆకలితో పస్తులుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రోజువారీ కూలీలకు భోజనం అందించేందుకు ముందుకొచ్చింది బాలీవుడ్ నటి వాణీకపూర్. ‘ఫ్యాన్ కైండ్’ సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేట్టిన వాణి.. ఇందులో విజేతలుగా నిలిచిన ఐదుగురికి తనతో వర్చువల్ డేటింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ‘దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో సాటి మనుషులుగా మద్దతివ్వాల్సిన అవసరం ఉంది. నా వంతు సాయంగా రోజువారీ కూలీలకు, వారి కుటుంబాలకు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తూ.. నిధులు సేకరిస్తున్నాను’ అని తెలిపింది.

మహారాష్ట్ర, బెంగళూర్, చెన్నై ప్రాంతాల్లో రూ.30 విలువ గల భోజనం ప్యాకెట్లను.. బియ్యం, పప్పు, కూరగాయలు, చపాతితో కూడిన న్యూట్రిషనల్ ఫుడ్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. Fankind.org/vani వెబ్‌సైట్‌కు లాగిన్అయి తోచిన సాయం చేయాలని కోరుతోంది.

Tags:    

Similar News