ఓడిన అల్లుడు శీను

దిశ, క్రైమ్ బ్యూరో : రామ్‌నగర్‌ డివిజన్ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు వేప శ్రీనివాస్ రెడ్డి ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి రవిచారి చేతిలో ఓటమి చెందారు. 2016లో రాంనగర్ డివిజన్ కార్పోరేటర్‌గా శ్రీనివాస్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈయన మాజీ హోం మంత్రి నాయినికి అల్లుడు మాత్రమే కాకుండా, స్వయానా మేనల్లుడు కూడా. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఉనికిని దెబ్బతీయడం కోసం బాగ్ […]

Update: 2020-12-04 06:06 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : రామ్‌నగర్‌ డివిజన్ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు వేప శ్రీనివాస్ రెడ్డి ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి రవిచారి చేతిలో ఓటమి చెందారు. 2016లో రాంనగర్ డివిజన్ కార్పోరేటర్‌గా శ్రీనివాస్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈయన మాజీ హోం మంత్రి నాయినికి అల్లుడు మాత్రమే కాకుండా, స్వయానా మేనల్లుడు కూడా. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఉనికిని దెబ్బతీయడం కోసం బాగ్ లింగంపల్లి డివిజన్ ను 2016లో రాంనగర్ డివిజన్ లో విలీనం చేశారు. కానీ, ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తరఫున తొలిసారి నిలబడ్డ రవి చారి చేతిలో శ్రీనివాస్ రెడ్డి ఓడిపోవడం గమనార్హం.

Tags:    

Similar News