నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిపితే సహించం
దిశ, మహబూబ్‌నగర్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరిపితే సహించేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ హెచ్చరించారు. నల్లమలలో అరుదైన వన్యప్రాణాలు ఉన్నాయని, చెంచులు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని ప్రభుత్వానికి వారు గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలకు జరపడం సరికాదని చెప్పారు. యురేనియం మైనింగ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఆదివాసులకు మనో ధైర్యం కలిగించేందుకు నాగర్ కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ వచ్చామన్నారు. కాగా, నల్లమలలో […]
దిశ, మహబూబ్‌నగర్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరిపితే సహించేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ హెచ్చరించారు. నల్లమలలో అరుదైన వన్యప్రాణాలు ఉన్నాయని, చెంచులు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారని ప్రభుత్వానికి వారు గుర్తు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలకు జరపడం సరికాదని చెప్పారు. యురేనియం మైనింగ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఆదివాసులకు మనో ధైర్యం కలిగించేందుకు నాగర్ కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ వచ్చామన్నారు. కాగా, నల్లమలలో వేసిన రోడ్లు, బోర్ డ్రిల్లింగ్ పనులను పరిశీలించడానికి వీహెచ్, వంశీకృష్ణలు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
Tags: V.Hanumantha Rao, Comments, Uranium mining, nallamala forest, mahabubnagar