కరోనా టైం.. చిన్నారులకు కొవిడ్ కథలు

దిశ, ఫీచర్స్ : దాదాపుగా రెండేళ్లుగా కరోనా వైరస్ గురించి వింటూనే ఉన్నాం. ఆ మహమ్మారి గురించి అందరిలోనూ కాస్తో కూస్తో అవగాహన వచ్చింది. మరి చిన్న పిల్లలకు కరోనావైరస్ గురించి ఎలా వివరిస్తాం? ఇదే ప్రశ్న సింగర్ జాంకీ పరేఖ్ మెహతాకు కూడా వచ్చింది. ఆ ప్రశ్నే తనను ఇన్‌స్టాగ్రామ్ వీడియో సిరీస్ రూపొందించడానికి ప్రేరేపించింది. ఈ వేదికగా జాంకీ.. ప్రపంచాన్ని కొవిడ్ ఎలా ప్రభావితం చేస్తుందనే కథలను చిన్నారులకు వివరిస్తుంది. ఇంకా మరెంతోమంది టీచర్స్, […]

Update: 2021-05-31 06:24 GMT

దిశ, ఫీచర్స్ : దాదాపుగా రెండేళ్లుగా కరోనా వైరస్ గురించి వింటూనే ఉన్నాం. ఆ మహమ్మారి గురించి అందరిలోనూ కాస్తో కూస్తో అవగాహన వచ్చింది. మరి చిన్న పిల్లలకు కరోనావైరస్ గురించి ఎలా వివరిస్తాం? ఇదే ప్రశ్న సింగర్ జాంకీ పరేఖ్ మెహతాకు కూడా వచ్చింది. ఆ ప్రశ్నే తనను ఇన్‌స్టాగ్రామ్ వీడియో సిరీస్ రూపొందించడానికి ప్రేరేపించింది. ఈ వేదికగా జాంకీ.. ప్రపంచాన్ని కొవిడ్ ఎలా ప్రభావితం చేస్తుందనే కథలను చిన్నారులకు వివరిస్తుంది. ఇంకా మరెంతోమంది టీచర్స్, స్టోరీ టెల్లర్స్, ఉపాధ్యాయులు వైద్యులు కొవిడ్ నేపథ్యాన్ని చిన్నారులకు సృజనాత్మకతను జోడించి వివరించే ప్రయత్నం చేశారు.

జాంకీ కొవిడ్ సమయంలోనే ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నోడి పేరు సూఫీ కాగా, తన మూడు నెలల బేబీ బాయ్‌కి వైరస్ కథలతో పాటు, ఫ్రీడమ్, కరేజ్ కథలను చెబుతోంది. ఈ వయసులో వాళ్లు అర్థం చేసుకోరు కానీ తనతో పాటు, తన వయసు పిల్లలు తాము పుట్టిన మహమ్మారి ప్రపంచాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముందని జాంకీ అంటోంది. కరోనా మహమ్మారి ఏడాదిన్నరగా మనల్ని బాధపెడుతోంది. చాలా మంది పిల్లలు ఇంటి లోపల వారి జీవితాలతో రాజీ పడ్డారు. కాని వారు తమ స్నేహితులను ఎందుకు కలుసుకోలేకపోతున్నారో లేదా వారు ఎందుకు చాలాసార్లు చేతులు కడుక్కోవాలో అర్థం చేసుకోలేక ఇంకా కష్టపడుతున్నారు. అయితే పేరెంట్స్, డాక్టర్స్ వారిని భయపెట్టకుండా అర్థమయ్యే విధంగా చెబితే బుద్ధిగా నేర్చుకోవడమే కాకుండా, హ్యాపీగా పాటిస్తారు.

కొన్ని పుస్తకాలు పిల్లల జీవితాలపై మహమ్మారి మానసిక ప్రభావాన్ని పరిష్కరిస్తాయి. అలాంటి ఓ పుస్తకమే శ్వేతా గణేష్ కుమార్ ‘ఎట్ హోమ్’. ఆశా కార్మికులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సుల వంటి ఫ్రంట్‌లైన్ కార్మికులను సూపర్ హీరోలని మనకు తెలుసు. ఇదే విషయాన్ని పిల్లలకు అందంగా, ఆకర్షణీయంగా చెప్పే ప్రయత్నం చేశారు రచయిత. ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ మినాక్షి దేవాన్. ఇక తొమ్మిదేళ్ల వీర్ కశ్యప్ కరోనా యుగా అనే వైరస్ ఆకారపు బోర్డు గేమ్ పిల్లల్లో అమితాసక్తిని కలిగించింది. ఈ ఆటలో బయటకు వెళ్లినవాళ్లు ఆటగాళ్లు వైరస్ బారిన పడకుండా ఇంటికి తిరిగి రావాలి. అందుకోసం మాస్క్ ధరించాలి. రైలు లేదా విమాన ప్రయాణం, కిరాణాకు వెళ్లినప్పుడు కొవిడ్ నిబంధనలు పాటించాలి. ఇలా మన చుట్టూ జరుగుతున్న వైరస్ పోరాటం గురించి రియల్ హీరో స్టోరీస్, నిజమైన భావోద్వేగాన్ని, నిజమైన పోరాటాన్ని చిన్నారులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

‘V ఫర్ వ్యాక్సిన్ వైరాలజిస్ట్ డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ పుస్తకం నుంచి ఇన్‌పుట్స్ తీసుకుని, టీకాలు వేస్తారనే భయాన్ని అధిగమించే వెని, విడి, విసి అనే మూడు పాత్రల కథను చెప్పాను. గత కొన్ని నెలలుగా వ్యాక్సిన్ల గురించి చాలా మాట్లాడుతుండటంతో పిల్లలు ఆసక్తిగా ఈ కథను విన్నారు. మరో కథలో వైరస్‌ను ‘కోవి’ అనే పాత్రతో ఇంట్రడ్యూ్స్ చేశాను. అది సూక్ష్మక్రిముల పాఠశాలలో ఓ భాగం కాగా, ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ సోకడం దీని లక్ష్యం. అయితే దీన్ని ఎదురించడానికి వీరోచిత సోప్ స్క్వాడ్ మనదగ్గర ఉంది. అంతేకాదు క్లీన్‌నెస్ ప్రొడక్ట్స్‌కు చెందిన మోట్లీ సిబ్బంది చివరకు కరోనా వైరస్‌ను ఓడిస్తారని వివరించాను’
– జాంకీ పరేఖ్ మెహతా, సింగర్

 

Tags:    

Similar News