ఉత్తరాఖండ్ సీఎంకు కరోనా
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు ఆయన తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉన్నదని, ఇటీవల తనను కలసిన వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో ఆయనను కలిసిన నేతల్లో టెన్షన్ స్టార్ అయింది. కొద్ది రోజుల క్రితమే తీరత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన […]
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు ఆయన తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉన్నదని, ఇటీవల తనను కలసిన వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో ఆయనను కలిసిన నేతల్లో టెన్షన్ స్టార్ అయింది. కొద్ది రోజుల క్రితమే తీరత్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మహిళలు ధరించే రిప్డ్ జీన్స్‌పై చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి.
मेरी कोरोना टेस्ट रिपोर्ट पॉजिटिव आई है। मैं ठीक हूँ और मुझे कोई परेशानी नहीं है । डॉक्टर्स की निगरानी में मैंने स्वयं को आइसोलेट कर लिया है ।आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे निकट संपर्क में आयें हैं, कृपया सावधानी बरतें और अपनी जाँच करवाएं।
— Tirath Singh Rawat (@TIRATHSRAWAT) March 22, 2021
తాజాగా ఆయన ‘అమెరికా భారత్‌ను 200 ఏళ్ల పాటు పాలించింది’ అంటూ మాట్లాడినందుకు గానూ ట్విట్టర్‌లో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. కాగా.. ఆదివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా పాజిటివ్ అని తేలగా, తాజాగా ఉత్తరాఖండ్ సీఎంకు కూడా కొవిడ్ సోకడం గమనార్హం.