బిగ్ బ్రేకింగ్: యూపీ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్ కన్నుమూశారు. అనారోగ్యంతో గతకొన్ని రోజులుగా లక్నోలోని సంజయ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌లో చేరి చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కళ్యాణ్‌సింగ్.. ఉత్తర్ ప్రదేశ్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2014 నుంచి 2019 వరకు రాజస్థాన్‌కు గవర్నర్‌గానూ పనిచేశారు. కళ్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. బాబ్రీ విధ్వంసం […]
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్ కన్నుమూశారు. అనారోగ్యంతో గతకొన్ని రోజులుగా లక్నోలోని సంజయ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌లో చేరి చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కళ్యాణ్‌సింగ్.. ఉత్తర్ ప్రదేశ్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2014 నుంచి 2019 వరకు రాజస్థాన్‌కు గవర్నర్‌గానూ పనిచేశారు. కళ్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. బాబ్రీ విధ్వంసం తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన విధించారు. తిరిగి 1998 ఫిబ్రవరి నుంచి 1999 నవంబరు వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. జనసంఘ్, జనతా పార్టీ, బీజేపీల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.