కరోనా టీకా వేయించుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి

దిశ, వెబ్ డెస్క్:దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఉదృతంగా మారుతున్నాయి. కరోనా వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం పలు రకాల చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కరోనా టీకా తీసుకున్నారు. లక్నోలోని సివిల్‌ హాస్పిటల్‌లో వ్యాక్సిన్‌ మొదటి డోసు వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా తగ్గినట్టే తగ్గి ఎక్కువ అవుతుందని, దీనికి కారణం వైరస్ […]

Update: 2021-04-04 23:33 GMT

దిశ, వెబ్ డెస్క్:దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఉదృతంగా మారుతున్నాయి. కరోనా వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం పలు రకాల చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కరోనా టీకా తీసుకున్నారు. లక్నోలోని సివిల్‌ హాస్పిటల్‌లో వ్యాక్సిన్‌ మొదటి డోసు వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా తగ్గినట్టే తగ్గి ఎక్కువ అవుతుందని, దీనికి కారణం వైరస్ ఏ విధంగా ప్రవర్తిస్తుందో సరిగ్గా గుర్తించలేకపోవడమే అని తెలిపారు. వ్యాక్సిన్ పై ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన పని లేదని, అందరు తమ వంతు వచ్చినప్పుడు టీకా తీసుకోవడానికి సిద్ధం గా ఉండాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News