యూపీ సీఎంపై అసమ్మతి గళం.. రేపు మోడీతో యోగి భేటీ

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. అలాగే, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ సమావేశం కానున్నారు. గురువారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో యోగి కలుసుకున్నారు. కరోనా కాలంలో వలస కార్మికుల సమస్యల పరిష్కారణలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను వివరించే పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. కరోనా నియంత్రణలో, ప్రజల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని సొంత పార్టీ […]

Update: 2021-06-10 10:45 GMT

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. అలాగే, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ సమావేశం కానున్నారు. గురువారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో యోగి కలుసుకున్నారు. కరోనా కాలంలో వలస కార్మికుల సమస్యల పరిష్కారణలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను వివరించే పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు.

కరోనా నియంత్రణలో, ప్రజల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని సొంత పార్టీ నేతల్లోనే సీఎం యోగి ఆదిత్యానాథ్‌పై విమర్శలు ఎదురయ్యాయి. వచ్చే ఏడాది తొలినాళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ బీజేపీ యూపీ శాఖలో అంతర్గతవైరాలు రచ్చకెక్కాయి. వీటిని దారిలోకి తేవడానికి కేంద్రం శాయశక్తుల ప్రయత్నిస్తున్నది.

Tags:    

Similar News