టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​ రాజీనామా

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి రాజీనామా చేశారు. టీపీసీసీ చీఫ్​ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వరుసగా ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ పరాజయం చెందుతుండటంతో పాటు గ్రేటర్​ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతింది. కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. గ్రేటర్​ ఎన్నికల్లో పరాజయానికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్​ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. టీపీసీసీ చీఫ్​గా కొత్తవారిని నియమించుకోవాలని ఏఐసీసీకి […]

Update: 2020-12-04 08:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి రాజీనామా చేశారు. టీపీసీసీ చీఫ్​ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వరుసగా ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ పరాజయం చెందుతుండటంతో పాటు గ్రేటర్​ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతింది. కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. గ్రేటర్​ ఎన్నికల్లో పరాజయానికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్​ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. టీపీసీసీ చీఫ్​గా కొత్తవారిని నియమించుకోవాలని ఏఐసీసీకి ఉత్తమ్​ లేఖ ద్వారా కోరారు.

Tags:    

Similar News