Corona3rd wave: బీ అలర్ట్.. థర్డ్ వేవ్ వచ్చేలా ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
దిశ, సూర్యాపేట: జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్స్ డెవలప్‌మెంట్ కోసం ఎంపీ ఫండ్స్‌ను మంజూరు చేసేందుకు కృషి చేస్తానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ నేపథ్యంలోనే కరోనా వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబాలను వదిలి పేషెంట్లకు సేవ చేస్తున్న వైద్య సిబ్బంది తీరు […]
దిశ, సూర్యాపేట: జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్స్ డెవలప్‌మెంట్ కోసం ఎంపీ ఫండ్స్‌ను మంజూరు చేసేందుకు కృషి చేస్తానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ నేపథ్యంలోనే కరోనా వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబాలను వదిలి పేషెంట్లకు సేవ చేస్తున్న వైద్య సిబ్బంది తీరు అభినందనీయమన్నారు. పేషెంట్లకు కావాల్సిన మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను వైద్యాధికారులు అందుబాటులో ఉంచాలని.. ఇందుకు ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా థర్డ్ వేవ్ (Corona3rd wave )వచ్చే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సూర్యాపేట వైద్య కళాశాలలో 300 బెడ్స్‌లకు 950కి పెంచేందుకు తన వంతు సాయం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.