మోడీ, కేసీఆర్‌పై ఉత్తమ్ విమర్శలు

దిశ, న్యూస్‌బ్యూరో: స్వాతంత్ర్య పోరాట సమయం కంటే లాక్‌డౌన్‌లోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వలస కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ నేత వీహెచ్‌ చేపట్టిన దీక్షకు ఆదివారం సంఘీభావం తెలిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రాలు కార్మికులను పట్టించుకోకుండా వారి జీవితాలకు అర్థం లేకుండా చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. షెల్టర్లు, వసతులు, భోజనాల ఏర్పాటు విషయంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. తాము సాయం చేస్తామంటే […]

Update: 2020-05-17 07:56 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: స్వాతంత్ర్య పోరాట సమయం కంటే లాక్‌డౌన్‌లోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వలస కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ నేత వీహెచ్‌ చేపట్టిన దీక్షకు ఆదివారం సంఘీభావం తెలిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రాలు కార్మికులను పట్టించుకోకుండా వారి జీవితాలకు అర్థం లేకుండా చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. షెల్టర్లు, వసతులు, భోజనాల ఏర్పాటు విషయంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. తాము సాయం చేస్తామంటే ఒప్పుకోకుండా, ప్రజల పక్షాన మాట్లాడితే అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో నిర్మలాసీతారామన్ చేసిన ప్రకటన ఇంతవరకు అందలేదని, మళ్లీ ఇప్పుడు ప్యాకేజీ ప్రకటించి ఏంలాభం అని ఎద్దేవా చేశారు. వలస కార్మికులను ఆదుకోవడంలో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని ఉత్తమ్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ వలస కార్మికులకు న్యాయం చేయకుంటే ఆమరణ దీక్షకు దిగుతానని స్పష్టం చేశారు.

Tags:    

Similar News