ఏసీలకు, కరోనాకు సంబంధమేమిటీ?
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న వేళ.. వదంతులు కూడా అంతకన్నా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలు కూడా కరోనా విషయంలో ఎక్కువగా భయపడుతుండటంతో అపోహలు ఆవహిస్తున్నాయి. మొన్నటి వరకు కరెన్పీ నోట్లు, పాల ప్యాకెట్, న్యూస్ పేపర్ చూస్తేనే భయపడ్డారు. వాటిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలిగిపోయాక ప్రశాంతంగా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఏసీలు వాడితే కరోనా త్వరగా వ్యాప్తి చెందుతుంది ’ అనే మెసేజ్ ప్రస్తుతం సోషల్ […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న వేళ.. వదంతులు కూడా అంతకన్నా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలు కూడా కరోనా విషయంలో ఎక్కువగా భయపడుతుండటంతో అపోహలు ఆవహిస్తున్నాయి. మొన్నటి వరకు కరెన్పీ నోట్లు, పాల ప్యాకెట్, న్యూస్ పేపర్ చూస్తేనే భయపడ్డారు. వాటిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలిగిపోయాక ప్రశాంతంగా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఏసీలు వాడితే కరోనా త్వరగా వ్యాప్తి చెందుతుంది ’ అనే మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో వాస్తవమెంత ఉందో తెలుసుకోవడానికి ఫ్యాక్ట్ చెక్ చేస్తే సరిపోతోంది. ప్రెస్ బ్యూరో ఇన్ఫర్మేషన్ (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ చేసి నిజాల్ని తేల్చింది.
As the mercury soars, here’s one more #PIBFactcheck
Claim : ACs should not be used to cool off in the heat, as they spread #Covid_19
Fact : It’s a little complicated. Window ACs are ok, but not central air-conditioning. Let’s listen to this segment from @DDNewslive 👇 pic.twitter.com/UkbZsJ4pIs
— PIB Fact Check (@PIBFactCheck) April 17, 2020
ఓ వైపు కరోనాతో ఇంట్లో ఉండాల్సి రాగా.. మరో వైపు ఎండలతో ఉక్కపోత బాగా పెరిగిపోయింది. ఈ సమయంలో ఇంట్లో సాధారణంగా కూలర్లు, ఏసీలు వాడటం సహజమే. ఇదే సమయంలో.. చల్లటి ప్రదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా వృద్ధి చెందుతుందన్న శాస్త్రవేత్తల వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారు. ఏసీలు వాడితే.. వైరస్ వ్యాప్తి చెందుతుందనే మెసెజ్ ను నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో వ్యాప్తి చేశారు. దీంతో ఇళ్లల్లో ఉక్కపోతగా ఉన్నప్పటికీ ఏసీలు వాడట్లేదు. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ చేసి అసలు విషయం తేల్చింది.
పీఐబీ తన ఫ్యాక్ట్ చెక్…
ఇంట్లో వాడుకునే విండో ఏసీలు వాడటం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని పీఐబీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపింది. అయితే సెంట్రల్ ఏసీలు వాడటం అంత మంచిది కాదని పేర్కొంది. పెద్ద పెద్ద సంస్థలు, ఆస్పత్రుల్లో సెంట్రల్ ఏసీలు ఉంటాయి కాబట్టి… అక్కడ ఎవరికైనా… కరోనా వైరస్ ఉంటే… అది మిగతా వారికి వ్యాపించే ప్రమాదం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే ఇంట్లో కరోనా బాధితులు లేకుంటే.. ఏసీలు నిరభ్యంతరంగా వాడొచ్చని అంటున్నారు. అంతేకాదు కొందరు ఎండలో నిలుచుంటే కరోనా వైరస్ అంతమవుతుందనే వదంతిని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. అందులోనూ ఎలాంటి వాస్తవం లేదని పీఐబీ తెలిపింది. వైరస్ ఉష్ణమండల దేశాల్లోనూ ప్రబలిందనే విషయం అందరికీ తెలిసిందే.
tags :corona virus, lockdown, ac, cooler, window ac, central ac, pib, fact check