ఈ ఘోరం డబ్ల్యూహెచ్‌వో వల్లే: ట్రంప్
కరోనా వైరస్ అమెరికాను చిగురుటాకుల వణికిస్తోంది. వైరస్ ప్రభావంతో రోజు వందల మంది మృత్యువాత పడుతున్నారు. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో( ప్రపంచ ఆరోగ్య సంస్థ)పై అమెరికా అధ్యక్షడు ట్రంప్ విరుచుకుపడ్డాడు. కరోనా విషయంలో డబ్ల్యూహెచ్‌వో చైనాకు అనుకూలంగా వ్యవహరించిందంటూ దుయ్యబట్టారు. వైరస్ విషయంలో డబ్ల్యూహెచ్‌వోపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు నిధులు నిలిపివేస్తామని ప్రకటించారు. అయితే ఎంతమేర నిధులు నిలిపివేస్తారు? […]
కరోనా వైరస్ అమెరికాను చిగురుటాకుల వణికిస్తోంది. వైరస్ ప్రభావంతో రోజు వందల మంది మృత్యువాత పడుతున్నారు. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో( ప్రపంచ ఆరోగ్య సంస్థ)పై అమెరికా అధ్యక్షడు ట్రంప్ విరుచుకుపడ్డాడు. కరోనా విషయంలో డబ్ల్యూహెచ్‌వో చైనాకు అనుకూలంగా వ్యవహరించిందంటూ దుయ్యబట్టారు. వైరస్ విషయంలో డబ్ల్యూహెచ్‌వోపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు నిధులు నిలిపివేస్తామని ప్రకటించారు. అయితే ఎంతమేర నిధులు నిలిపివేస్తారు? లేక మొత్తం నిధులను నిలుపుదల చేస్తారా? అన్నదానిపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు.
‘డబ్ల్యూహెచ్‌వో అన్ని దేశాలను సమానంగా చూడలేదు. చైనాకు పక్షపాతంగా వ్యవహరిస్తూ… అక్కడ వైరస్ విజృంభిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయింది. డబ్ల్యూహెచ్‌వో సిఫారస్సుల కారణంగానే అమెరికాకు అంతర్జాతీయ ప్రయాణాలు కొనసాగాయి. ముందుగానే హెచ్చరించి ఉంటే ఇంత తీవ్ర నష్టం జరిగేది కాదు’ అంటూ డబ్ల్యూహెచ్‌వో తీరుపై ట్రంప్ మండిపడ్డారు.
Tags: US President, Donald Trump, WHO, Coronavirus, China, Covid-19