క్రిప్టోకరెన్సీ వివాహం.. డిజిటల్ టోకెన్స్‌ను రింగులుగా మార్చుకున్న జంట
దిశ, ఫీచర్స్ : జీవితంలో మధురానుభూతిగా నిలిచే ‘పెళ్లి’ని మరింత స్పెషల్ డేగా మలుచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొందరు మాత్రం అందరికంటే తాము సమ్‌థింగ్ డిఫరెంట్ అని చాటి చెప్పాలనుకుంటారు. ఈ క్రమంలోనే పెళ్లి మండపానికి హెలికాప్టర్‌లో రావడం, సముద్రపు అడుగున రింగ్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం, గాల్లో దండలు మార్చుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే మరింత ముందుచూపుతో ఆలోచించిన ఓ కాలిఫోర్నియా జంట.. ఎన్‌ఫీటీ (నాన్ ఫంజిబుల్ టోకెన్) రింగ్స్ మార్చుకున్నారు. ప్రస్తుతం డిజిటల్ […]
దిశ, ఫీచర్స్ : జీవితంలో మధురానుభూతిగా నిలిచే ‘పెళ్లి’ని మరింత స్పెషల్ డేగా మలుచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొందరు మాత్రం అందరికంటే తాము సమ్‌థింగ్ డిఫరెంట్ అని చాటి చెప్పాలనుకుంటారు. ఈ క్రమంలోనే పెళ్లి మండపానికి హెలికాప్టర్‌లో రావడం, సముద్రపు అడుగున రింగ్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం, గాల్లో దండలు మార్చుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే మరింత ముందుచూపుతో ఆలోచించిన ఓ కాలిఫోర్నియా జంట.. ఎన్‌ఫీటీ (నాన్ ఫంజిబుల్ టోకెన్) రింగ్స్ మార్చుకున్నారు.
ప్రస్తుతం డిజిటల్ కరెన్సీ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘కాయిన్‌బేస్ సంస్థ(క్రిప్టోకరెన్సీ ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫామ్) ఉద్యోగులైన కాలిఫోర్నియా జంట రెబెక్కా రోజ్, పీటర్ కాచెర్‌జింక్సీలు తమ పెళ్లి ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఆ వేదికపై అడ్వాన్స్డ్ టెక్ ఎలిమెంట్స్ ఉండాలనుకున్నారు. ఈ మేరకు వారు తమ వివాహ జీవితంలో అడుగుపెట్టేందుకు ‘వర్చువల్ రింగులు’గా డిజిటల్ టోకెన్లను మార్పిడి చేసుకున్నారు. ఆ రింగ్స్‌కు ‘టాబాట్ (హిబ్రూలో టాబార్ అంటే రింగ్ అని అర్థం) అని పేరు కూడా పెట్టుకున్నారు. అంతేకాదు ఈ డిజిటల్ వాలెట్ కరెన్సీ మ్యారేజ్ ప్రాముఖ్యతను వివరించడానికి వారు ఒక చిన్న యానిమేషన్‌ను కూడా పంచుకున్నారు. దీంట్లో వివాహం, డిజిటల్ కరెన్సీ వంటి విభిన్న విషయాలను ఒక్కటిగా చేర్చారు. కాగా బ్లాక్‌చెయిన్‌లో శాశ్వతంగా రికార్డు కానున్న వారి వివాహం.. క్రిప్టోగ్రఫీని ఉపయోగించి అనుసంధానించిన ‘బ్లాక్స్’ అని పిలిచే రికార్డుల జాబితాలో ఉంటుంది. ఇది కొందరికి అసాధారణంగా అనిపించొచ్చు కానీ.. ఇది నిజంగా ఆ జంట బంధాన్ని, క్రిప్టోకరెన్సీ పట్ల వారి అభిరుచిని తెలిపింది.
‘మా డిజిటల్ రింగ్స్ ఇప్పుడు బ్లాక్‌చెయిన్‌లో ఉన్నాయి. మా అంకితభావం, ప్రేమకు రుజువుగా వాటిని చూడాలి. చాలా మంది మతపరమైన ప్రార్థనా స్థలంలో, బీచ్‌లో లేదా పర్వతాలలో వివాహం చేసుకుంటారు. పీటర్, నేను ఆ జాబితాలో లేము. మేము # బ్లాక్ చెయిన్‌లో వివాహం చేసుకున్నాం’ అంటూ రోజ్ తన సంతోషాన్ని పేర్కొంది.