తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. ఆ జిల్లాలో కుండపోత

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన ఒక రోజు ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం కుండపోత వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ శుక్రవారం వర్షపాతంపై ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఖమ్మంలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా మహబూబాబాద్ […]

Update: 2021-06-03 21:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన ఒక రోజు ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం కుండపోత వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ శుక్రవారం వర్షపాతంపై ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఖమ్మంలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో వర్ష ప్రభావం అధికంగా ఉందని.. 119.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయిందని ప్రకటనలో తెలిపింది. 3వ తేది ఉదయం 8.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు నమోదైన వర్షపాత వివరాలను తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.

వర్షపాత వివరాలు..

Tags:    

Similar News